e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 25, 2021
Home రివ్యూస్‌ నితిన్‌ 'చెక్‌' సినిమా రివ్యూ

నితిన్‌ ‘చెక్‌’ సినిమా రివ్యూ

ప్రేమ‌క‌థా చిత్రాల‌లో ఎక్కువ‌గా న‌టిస్తూ ల‌వ‌ర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్నాడు నితిన్‌. మరోవైపు వైవిధ్య‌భ‌రితమైన క‌థ‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచాడు డైరెక్ట‌ర్ చంద్ర‌శేఖ‌ర్ యేలేటి. ఈ ఇద్ద‌రు  త‌మ లిమిటేష‌న్స్ ను చెరిపేసుకుని చేసిన చిత్రం చెక్‌. చాలా రోజుల త‌ర్వాత నితిన్ నుంచి చెస్ నేప‌థ్యంలో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ జాన‌ర్ లో సినిమా వ‌స్తుండ‌టంతో ప్రేక్ష‌కులంతా చాలా ఎక్జ‌యిటింగ్  గా ఎదురుచూశారు. ఈ చిత్రంలో నితిన్ ఖైదీగా క‌నిపించ‌డానికి కార‌ణాలేంటీ..? చ‌ంద్ర‌శేఖ‌ర్ యేలేటి చెస్ బ్యాక్‌డ్రాప్ స్టోరీని ప్రేక్ష‌కుల‌కు అందించ‌డంలో ఎంత‌వ‌ర‌కు స‌క్సెస్ అయ్యాడ‌నేది తెలుసుకుందాం. 

క‌థ‌లోకి వెళ్తే..

ఆదిత్య అనే యువ‌కుడు త‌నకున్న తెలివితేట‌ల‌ను దొంగ‌త‌నం కోసం ఉప‌యోగిస్తాడు. పేర్లు మార్చుకుంటూ చిన్న చిన్న చోరీలు చేస్తూ స‌ర‌దాగా ఎంజాయ్ చేస్తుంటాడు. ఆదిత్యకు త‌న జ‌ర్నీలో యాత్ర (ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్) ప‌రిచ‌య‌మ‌వ‌డంతో..ఆమెతో ప్రేమలో ప‌డ‌తాడు. మ‌రోవైపు భార‌త్‌లో ఉగ్ర‌వాదులు దాడిలో 40 మంది ప్రాణాలు కోల్పోతారు. ఈ కేసులో ఆదిత్య‌కు ఉరిశిక్ష ప‌డుతుంది. అయితే చేయ‌ని నేరానికి శిక్ష ప‌డ్డ ఆదిత్య‌..తానెలాంటి నేరం చేయ‌లేద‌ని కోర్టులో పిటిష‌న్ వేస్తాడు. ఆదిత్య కేసును వాదించ‌డానికి మాన‌స (ర‌కుల్ ప్రీత్‌సింగ్‌) ముందుకొస్తుంది. ఓ వైపు కోర్టులో కేసు న‌డుస్తుండ‌గా జైలులో ఆదిత్య‌కు శ్రీమ‌న్నారాయ‌ణ (సాయిచంద్‌)అనే ఖైదీ ప‌రిచ‌య‌మ‌వుతాడు. ఆదిత్య‌కు శ్రీమ‌న్నారాయ‌ణ చెస్ నేర్పిస్తాడు. ఆదిత్య టాలెంట్ నేష‌న‌ల్ చెస్ చాంపియ‌న్ షిప్ గెలుస్తాడ‌ని విశ్వసించిన శ్రీమ‌న్నారాయ‌ణ‌..ఆదిత్య‌ను చెస్ గేమ్ ఆడేలా ఒప్పిస్తాడు.

- Advertisement -

ఇక ఆదిత్య‌కు క్ష‌మాభిక్ష లభించేలా జూనియ‌ర్ లాయ‌ర్ మాన‌స (ర‌కుల్‌ప్రీత్ సింగ్‌) ప్ర‌య‌త్నాలు చేస్తుంది. చెస్‌లో చాంపియ‌న్ అయిన ఆదిత్య‌కు ఆ గేమ్ వ‌ల్లే క్ష‌మాభిక్ష ల‌భిస్తుంద‌ని భావించి ఆ దిశ‌గా ప్ర‌యత్నాలు చేస్తుంది. మరోవైపు ఎస్పీ న‌ర‌సింహారెడ్డి (సంప‌త్‌రాజ్‌) ఆదిత్య‌కు క్ష‌మాభిక్ష ల‌భించ‌కుండా చేసేందుకు ప్ర‌య‌త్నిస్తాడు. ఇంత‌కీ ఆదిత్య‌కు క్ష‌మాభిక్ష ల‌భించిందా..? అస‌లు ఉగ్ర‌దాడి కేసులో ఆదిత్య ఎలా ఇరుక్కున్నాడు..? ఇంత‌కీ యాత్ర ఎవ‌రు? చ‌ఎ చెస్ గేమ్ ఆదిత్య‌కు ఎంత‌వ‌ర‌కు ఉప‌యోగ‌ప‌డింది. ఎస్పీ న‌రిసింహారెడ్డికి ఆదిత్య అంటే ఎందుకంత కోపం..?  జైలు నుంచి ఆదిత్య ఏవిధంగా త‌ప్పించుకున్నాడనేది మిగిలిన క‌థ‌. 

నితిన్ ఖైదీ పాత్ర‌లో లీన‌మైపోయాడ‌ని చెప్పొచ్చు. ఓ చెస్ చాంపియ‌న్ ఎలా గేమ్ ఆడ‌తాడో..ఏవిధంగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తాడో తెలియ‌జేసేట్టు నితిన్ న‌ట‌న ఉంటుంది. లాయ‌ర్ పాత్ర‌లో ర‌కుల్‌ప్రీత్ సింగ్ మెప్పించింది. ఇప్ప‌టివ‌ర‌కు గ్లామ‌ర్ పాత్ర‌ల్లో క‌నిపించిన ర‌కుల్ ఈ సారి లాయ‌ర్ గా త‌న పాత్ర‌కు న్యాయం  చేసింద‌నే చెప్పాలి. నితిన్ త‌ర్వాత ఈ మూవీలో చాలా కీల‌కమైన పాత్ర శ్రీమ‌న్నారాయ‌ణ‌. చేయ‌ని త‌ప్పుకు జైలు పాలైన ఖైదీ పాత్ర‌లో ఆయ‌న జీవించాడు. శ్రీమ‌న్నారాయ‌ణ డైలాగ్స్, హావ‌భావాలు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. సెకండ్ హీరోయిన్‌గా న‌టించిన ప్రియావారియ‌ర్ కు తెలుగులో ఇది మొద‌టి సినిమా. యాత్ర పాత్ర‌లో క‌నిపించేది కొద్దిసేపే అయినా ప్రియావారియ‌ర్ స‌న్నివేశాలు కీల‌కంగా ఉంటాయి. ఎస్పీ పాత్ర‌లో సంప‌త్ రాజ్‌, ర‌కుల్ తండ్రిగా పోసాని కృష్ణ‌ముర‌ళి, జైల‌ర్ గా ముర‌ళీశ‌ర్మ త‌మ ప‌రిధుల మేర‌కు న్యాయం చేశారు.

ఎలా ఉందంటే..?

వైవిధ్య‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించ‌డంలో దిట్ట డైరెక్ట‌ర్ చంద్ర‌శేఖ‌ర్ యేలేటి. జీవితాల్లో జ‌రిగే సంఘ‌ట‌న‌లు..ప్ర‌తీ ఒక్క‌రి జీవితంలో జ‌రిగే బావోద్వేగ‌పూరిత స‌న్నివేశాల మేళ‌వింపుతో సాగే సినిమాలు తీస్తుంటాడు యేలేటి. చెక్ చిత్రం కూడా ఈ కేట‌గిరీలో వ‌స్తుంది. గ‌త సినిమాల్లోలాగానే మైండ్‌గేమ్‌కు పెద్ద పీట వేశాడు. అయితే  ఈ సారి చెస్ గేమ్ నేప‌థ్యం ఉండ‌టంతో సినిమా ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. ఫ‌స్ట్ హాఫ్‌లో ఏ ట్విస్టుల‌ను చెప్ప‌కుండా చూసుకున్న యేలేటి..ఆదిత్య ఈ కేసులో ఎలా ఇరుక్కున్నాడో చెప్ప‌కుండా క్యూరియాసిటీని పెంచాడు. సెకండాఫ్‌లో అస‌లు క‌థ మొద‌లై..ట్విస్టుల‌తో సాగుతుంది. కానీ సెకండాఫ్ ఎక్కువ‌గా జైలు నేప‌థ్యం ఉండే స‌రికి ప్రేక్ష‌కుల‌కు బోర్ కొడుతుంది.

హీరో ను నేష‌న‌ల్ చాంపియ‌న్ విన్న‌ర్‌గా చూపించే సీన్లు ప‌స లేకుండా క‌నిపిస్తాయి. స్క్రీన్ ప్లే బాగుంది. క్లైమాక్స్ అంత‌గా మెప్పించ‌క‌పోయినా..ఆదిత్య కేసు నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడో చెప్పే విశ్లేష‌ణ బాగుంటుంది. యేలేటి ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుంద‌ని చెప్ప‌క‌నే చెప్పాడు. క‌ల్యాణి మాలిక్ సంగీతం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను మ‌రో స్థాయికి తీసుకెళ్తుంది. క‌థానుగుణంగా నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. 

ప్ల‌స్ పాయింట్స్ : క‌థ‌, క‌థ‌నం, నితిన్, సాయిచంద్‌ న‌ట‌న, బ్యాగ్రౌండ్‌ స్కోర్‌

మైన‌స్ పాయింట్స్ : సాగ‌దీత‌గా ఉండే స‌న్నివేశాలు, క్లైమాక్స్ 

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement