e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, April 23, 2021
Advertisement
Home ఇంటర్వూ నాని రెమ్యున‌రేష‌న్‌పై క్రేజీ అప్‌డేట్..!

నాని రెమ్యున‌రేష‌న్‌పై క్రేజీ అప్‌డేట్..!

నాని రెమ్యున‌రేష‌న్‌పై క్రేజీ అప్‌డేట్..!

తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ బిజీగా ఉండే హీరో నాని. హిట్స్ వచ్చినా.. ఫ్లాప్ వచ్చినా ఈయన కోసం మాత్రం నిర్మాతలు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. దర్శకులు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. కుర్ర దర్శకులు, సీనియర్స్ అనే తేడా లేకుండా నాని కోసం కథలు సిద్ధం చేస్తుంటారు. అందుకే కెరీర్ లో వరస ఫ్లాపులు వచ్చినపుడు కూడా నానికి అవకాశాలు మాత్రం రాకుండా ఆగలేదు. నేచురల్ స్టార్ అనే పేరు కూడా నానికి వరస ఆఫర్స్ తెచ్చి పెడుతుంది. పైగా ఇప్పుడు ఈయన స్టార్ హీరో కూడా. ఆ ట్యాగ్ లేనపుడే బాక్సాఫీస్ దగ్గర కుమ్మేసాడు ఈయన. ఇప్పుడు నానికి అదిరిపోయే మార్కెట్ ఉంది. ఈయన సినిమాలు హిట్ అయితే కచ్చితంగా 40 కోట్ల వరకు కలెక్ట్ చేస్తాయి. నాని సినిమాలకు బడ్జెట్ మాత్రం 20 కోట్లు దాటదు. 

నిర్మాతలకు రిలీజ్ కు ముందుగానే లాభాలు రావడం ఖాయం. అలా నానితో సినిమా చేస్తే తిరుగుండదు.. వాళ్లకు నష్టముండదు అనే భావన నిర్మాతల్లో వచ్చేసింది. అందుకే నానికి అంత క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు కూడా ఈయన మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఎప్రిల్ లో టక్ జగదీష్ విడుదల కానుంది.. ఆ తర్వాత శ్యామ్ సింగ రాయ్ రానుంది.. ఆ వెంటనే అంటే సుందరానికి అంటూ వచ్చేస్తున్నాడు. మూడు సినిమాలు కుర్ర దర్శకులే తెరకెక్కిస్తుండటం విశేషం. శివ నిర్వాణ, వివేక్ ఆత్రేయ, రాహుల్ సంక్రీత్యన్ లాంటి దర్శకులకు అవకాశాలు ఇచ్చాడు నేచురల్ స్టార్. ఇదిలా ఉంటే ఈ మూడు సినిమాలకు కలిపి దాదాపు 18 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు నాని. గతంలో వరస విజయాలు వచ్చినపుడు సినిమాకు 8 కోట్ల వరకు తీసుకున్నాడు నాని. కానీ ఆ తర్వాత ఫ్లాపులు రావడం.. ప్యాండమిక్ సిచ్యువేషన్స్‌తో రేంజ్ ఒక్కసారిగా 4 కోట్ల వరకు పడిపోయింది. 

Advertisement
నాని రెమ్యున‌రేష‌న్‌పై క్రేజీ అప్‌డేట్..!

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement