మంగళవారం 02 మార్చి 2021
Realestate - Jan 16, 2021 , 02:26:53

బాత్రూమ్‌లోనూ స్టోరేజ్‌

బాత్రూమ్‌లోనూ స్టోరేజ్‌

ఇల్లు ఎంత పెద్దగా ఉన్నా, స్టోరేజ్‌ అనేది ఎప్పుడూ ఓ సమస్యగానే ఉంటుంది. హాల్‌లో షెల్ఫ్‌లు, బెడ్రూమ్‌లో వార్డ్‌రోబ్‌ ఉన్నప్పటికీ .. కొన్ని వస్తువులు మాత్రం ఇంట్లో ఎక్కడ పడితే అక్కడే ఉండిపోయి చికాకు పుట్టిస్తాయి. ముఖ్యంగా బాత్రూమ్‌కు సంబంధించిన వస్తువులైతే మరీ ఇబ్బంది పెట్టేస్తుంటాయి. ఎందుకంటే, చాలా బాత్రూముల్లో సబ్బులు, సౌందర్య ఉత్పత్తులు పెట్టేందుకు తగినంత స్థలం ఉండదు. అలాంటివారికి ఈ ‘టూ ఇన్‌ వన్‌ మిర్రర్లు’ మంచి ఆప్షన్‌. గోడకు బిగించేలా ఉండే ఈ అద్దాల వెనుక వైపున స్టోరేజీ కోసం స్థలం ఉంటుంది. సబ్బులు, సౌందర్య ఉత్పత్తులను ఇందులో దాచేసుకోవచ్చు. బాత్రూమ్‌తోపాటు ఇంటినీ అందంగా ఉంచుకోవచ్చు. 


VIDEOS

logo