శనివారం 28 నవంబర్ 2020
Realestate - Nov 21, 2020 , 00:14:03

స్థిరాస్తికి ఊపిరి

స్థిరాస్తికి ఊపిరి

 • ‘రియల్‌ ఎస్టేట్‌'కు అండగా టీఆర్‌ఎస్‌ సర్కారు
 • నిర్మాణరంగంలో విప్లవాత్మక సంస్కరణలు  
భాగ్యనగర ‘స్థిరాస్తి’ రంగానికి టీఆర్‌ఎస్‌ సర్కారు కొత్త ఊపిరులూదింది. విశ్వనగరమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ అనేక విప్లవాత్మక సంస్కరణలు తీసుకురాగా, హెచ్‌ఎండీఏ పరిధిలో ‘రియల్‌ ఎస్టేట్‌' దూసుకెళ్తున్నది. ‘కరోనా’తో దేశంలోని అన్ని నగరాల్లో ‘స్థిరాస్తి’ వ్యాపారం కుదేలైపోయింది. కానీ, తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహంతో హైదరాబాద్‌ ‘రియల్‌' రంగం.. ‘మూడు వెంచర్లు-ఆరు ప్లాట్లు’గా కళకళలాడుతున్నది.
రాష్ట్ర ఏర్పాటుకు ముందు ‘హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌'పై కమ్ముకున్న కారుమబ్బులు, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో దూదిపింజల్లా తొలగిపోయాయి. తెలంగాణ ఏర్పడితే అంతా అంధకారమేనని సమైక్యవాదులు చేసిన వ్యాఖ్యల్లో ఏ మాత్రం వాస్తవం లేదని, అతికొద్ది కాలంలోనే నిరూపితమైంది. సీఎం కేసీఆర్‌ పాలనలో హైదరాబాద్‌ స్థిరాస్తి రంగం ఎన్నడూ లేని ప్రగతిని సాధించింది. నోట్ల రద్దు, ఆర్థికమాంధ్యం, కరోనాలాంటి ఆపత్కాలాల్లో ముఖ్యమంత్రితోపాటు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ నిర్మాణరంగానికి సరైన ప్రోత్సాహాన్ని అందించారు. పెరిగిన ఇసుక, సిమెంట్‌ ధరలను అదుపులోకి తీసుకురావడం, ప్రాజెక్టుల అనుమతి గడువును ఏడాదికి పెంచడం, ఎలాంటి అధిక రుసుం లేకుండానే వాయిదాల పద్ధతి.. ఇలా అనేక సంస్కరణలను అమలు చేశారు. భవిష్యత్‌లో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధే లక్ష్యంగా అప్రోచ్‌ రోడ్డు ‘వంద’ అడుగులు ఉండాలన్న నిబంధనను తీసుకువచ్చారు. ఫలితంగా ‘హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌' రయ్‌మంటూ దూసుకుపోతున్నది. పెట్టుబడులే లక్ష్యంగా ప్రభుత్వ చర్యలు ఒకవైపు.. భాగ్యనగరమే సురక్షితమని భావించి అనేక జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్‌ దిక్కు చూస్తుండటంతో స్థిరాస్తి రంగం పూర్వకళను సంతరించుకుంటున్నది. ఫలితంగా కరోనా లాక్‌డౌన్‌తో స్వస్థలాలకు వెళ్లిన వలసకూలీలు తిరిగి నగరానికి వచ్చేశారు. ఈ క్రమంలోనే కరోనా కష్టకాలంలోనూ హైదరాబాద్‌ రియల్‌రంగం అద్భుత ప్రగతిని కనబర్చిందని ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ జేఎల్‌ఎల్‌-సీసీఐ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో తేలింది. 

లాక్‌డౌన్‌లోనూ అండగా..

కొవిడ్‌  నేపథ్యంలో నిర్మాణరంగ కార్మికుల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకున్నది. వలస కార్మికులు పనులు లేక ఇబ్బంది పడుతుంటే, సర్కారు అండగా నిలిచింది. 
 • వలస కార్మికుల కోసం 208 లేబర్‌ క్యాంపులను ఏర్పాటు చేసింది.
 • లేబర్‌ క్యాంపులకు ప్రత్యేకంగా నోడల్‌ అధికారులను నియమించి కార్మికుల భద్రత, సంక్షేమం కోసం చర్యలు చేపట్టింది.
 • ఆహార పదార్థాలను అందజేయడంతోపాటు వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు వైద్య బృందాలను ఏర్పాటు చేసింది. 
 • కార్మికులకు అన్నపూర్ణ భోజనాలు ఉచితంగా అందించింది. 
 • వలస కార్మికులను రవాణా చేసేందుకు అవసరమైన వాహనాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, వారిని స్వస్థలాలకు పంపించింది.
 • అవసరమైన వారికి కర్ఫ్యూ పాస్‌లను అందించింది. తద్వారా భవన నిర్మాణాల పనులు జరిగేలా చేయడంతోపాటు నిర్మాణ సామాగ్రిని రవాణా చేసేందుకు అవకాశం కల్పించింది.
 • లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన భవన నిర్మాణ పనులను చేపట్టేందుకు ప్రభుత్వం మరో ఏడాది గడువును పెంచుతూ జీవో. నం.108ను జారీ చేసింది. మళ్లీ ఎలాంటి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా చూసింది.

భారీగా పెట్టుబడులు 

కరోనా సంక్షోభ సమయంలోనూ హైదరాబాద్‌ నగరం తన పోటీతత్వాన్ని ప్రదర్శించింది. రియల్‌ రంగంతోపాటు ‘ఆఫీస్‌ స్పేస్‌'లోనూ జోరును కనబరిచింది. దేశంలోని ప్రధాన మెట్రోనగరాల్లోని ‘ఆఫీస్‌ స్పేస్‌' వినియోగంలో, హైదరాబాద్‌ రెండో స్థానంలో నిలిచినట్లు ‘నైట్‌ ఫ్రాంక్‌ సంస్థ’ తన సర్వేలో తేల్చింది. 2015లో ఆరో స్థానంలో ఉన్న భాగ్యనగరం కేవలం ఐదేండ్ల వ్యవధిలోనే ఢిల్లీ, చెన్నై తదితర నగరాలను వెనక్కినెట్టింది. దీంతోపాటు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో అనేక బహుళజాతి, దేశీయ సంస్థలు హైదరాబాద్‌ కేంద్రంగా పెట్టుబడులు పెట్టేందుకు, వివిధ రంగాల్లో కొత్త పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గోల్డ్‌మన్‌ శాక్స్‌ సంస్థ దేశంలో తన రెండో కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. మేధా ఆధ్వర్యంలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, ఆదిభట్లలో విమానాల విడివిభాగాల తయారీ పరిశ్రమతోపాటు షాబాద్‌లో 3,600 ఎకరాల్లో భారీ పారిశ్రామిక పార్కు ఏర్పాటైంది. భారత జాతీయ చెల్లింపుల సంస్థ (ఎన్‌పీసీఐ) హైదరాబాద్‌లోని నార్సింగిలో రూ. 500 కోట్లతో అంతర్జాతీయ ఆధునాతన డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అన్నిటికంటే ముఖ్యంగా అమెజాన్‌ సంస్థ తమ రెండో వెబ్‌ సర్వీసెస్‌ (ఏడబ్ల్యూఎస్‌) కేంద్రం ఏర్పాటుకు భాగ్యనగరాన్నే ఎంచుకున్నది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా దాదాపు రూ.20,761 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావడం, హైదరాబాద్‌ అభివృద్ధికి అద్దం పడుతున్నది.

మేలు చేసేలా సడలింపులు 

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణరంగానికి మేలు కలిగేలా అనేక సడలింపులు, ప్రోత్సాహకాలను తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి 2012లో జారీ చేసిన జీవో ఎం.ఎస్‌.నం. 168కు సవరణ చేస్తూ 2016 మే 1వ తేదీన కొత్తగా జీ.వో.నం.7ను జారీ చేసింది. ఇందులోని ముఖ్యాంశాలు.. 
 • రోడ్డు వెడల్పునకు సంబంధించిన అంశం, ఎత్తు, సెట్‌బ్యాక్‌, టీడీఆర్‌ హక్కులను పంచుకునేలా అవకాశం కల్పించడం.
 • గతంలో టీడీఆర్‌ సర్టిఫికెట్‌ విలువ 200 శాతం ఉంటే, దాన్ని  250 శాతానికి పెంచడం.
 • ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇంపాక్ట్‌ ఫీ నగర స్థాయిలో విస్తరించడం.
 • ఖాళీ ప్లాట్లకు ప్రయోజనాలను కల్పించడం. 
 • రోడ్డు విస్తరణలో తీసుకున్న ప్లాటు స్థలానికి విలువను నిర్ణయించి, దాన్ని బిల్డింగ్‌ అనుమతి కోసం చెల్లించే ఫీజులో రాయితీ ఇవ్వడం. 
 • నగర స్థాయిలో చేపట్టే ప్రాజెక్టులకు - ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇంపాక్ట్‌ ఫీజును వాయిదాల్లో చెల్లించే సౌలభ్యాన్ని కల్పించడం.

రికార్డు స్థాయి అనుమతులు