మంగళవారం 02 మార్చి 2021
Realestate - Jan 16, 2021 , 02:35:53

పాత రాళ్లే.. కొత్తగా

పాత రాళ్లే.. కొత్తగా

‘గార్డెనింగ్‌' అంటే అందరికీ ఇష్టమే. ఉదయాన్నో సాయంత్రమో ఓ గంటసేపు తోటలో పనిచేస్తే చాలు.. మానసిక ప్రశాంతత దొరికినట్టే. అందుకోసమే ఇప్పుడు ఎక్కువమంది పెరటి తోటలను పెంచుకుంటున్నారు. స్థలాభావం ఉన్నవారు మిద్దెతోటలవైపు అడుగులేస్తున్నారు. అయితే, ఈ తోటలు ఎంత బాగుంటే ఇంటికి అంత అందం వస్తుంది. నిన్న మొన్నటి దాకా గార్డెన్‌లో నడిచేందుకు ‘పార్కింగ్‌ టైల్స్‌'తో దారిని ఏర్పాటు చేసుకునేవారు. కానీ, ఇప్పుడు ట్రెండ్‌ మారింది. పాత గులకరాళ్లతోనే అద్భుతమైన ‘వాక్‌వే’లను నిర్మిస్తున్నారు నయా ఆర్కిటెక్టులు. ఇంటి యజమానుల అభిరుచికి తగ్గట్లుగా, వారికి నచ్చిన డిజైన్లలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ గులకరాళ్లపై చెప్పులు లేకుండా నడవడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుందని చెబుతున్నారు. 


VIDEOS

logo