శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Realestate - Feb 13, 2021 , 00:30:29

హాట్‌ కేకుల్లా ప్లాట్లు

హాట్‌ కేకుల్లా ప్లాట్లు

ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ‘యుషిత హౌసింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌', ఇటీవల ప్రారంభించిన మూడు వెంచర్లకూ వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నది. ‘ఎస్‌ఎస్‌ఆర్‌ గ్రీన్‌ మెడోస్‌' పేరిట సంగారెడ్డి వద్ద, ‘ధరణి ఎన్‌క్లేవ్‌' పేరుతో సంగారెడ్డి జిల్లా సదాశివపేట సమీపంలోని ఆరూర్‌లో, ‘నీల్‌ గార్డెన్స్‌' పేరిట సదాశివపేటలో మూడు నూతన వెంచర్లను ఏర్పాటు చేశారు. సంగారెడ్డి, సదాశివపేట గ్రోత్‌ కారిడార్‌ వద్ద ప్రారంభించిన ఈ ఓపెన్‌ ప్లాట్లు.. హాట్‌ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. వెంచర్లను లాంచ్‌ చేసిన మొదటిరోజే 30శాతానికిపైగా ప్లాట్లను వినియోగదారులు బుక్‌ చేసుకున్నట్లు యుషిత హౌసింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జి.కమలాకర్‌ తెలిపారు. విశాలమైన రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, ఎవెన్యూ ప్లాంటేషన్‌లాంటి సకల సౌకర్యాలనూ తమ వెంచర్లలో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 


VIDEOS

logo