శుక్రవారం 22 జనవరి 2021
Realestate - Jan 02, 2021 , 00:04:02

పిల్లల గది ఇలా ఉండాలి!

పిల్లల గది ఇలా ఉండాలి!

అసలే పాఠశాలలు లేవు. చదువుకంటే ఆటలకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు పిల్లలు.  గది ప్రశాంతంగా ఉంటే, చదువు బాగా అబ్బుతుందని నిపుణులు అంటున్నారు. టీచర్లు కూడా ఇదే విషయం చెప్తున్నారు. పిల్లల గది ఎలా ఉండాలి? వాళ్ల మూడ్‌కు తగ్గట్టు  ఎలా తీర్చిదిద్దాలి? అన్నది తెలుసుకుందాం. 

  • పిల్లలు చదువుకునే గదిలో స్టడీ టేబుల్‌ ఉండేలా చూసుకోవాలి. కూర్చునే విధానం కూడా ఏకాగ్రతపై ప్రభావం చూపుతుంది. కాబట్టి దీనిని కచ్చితంగా పాటించాలి. స్టడీ టేబుల్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ కిటికీకి నేరుగా ఉండకూడదు. ఇలా ఉండటం వల్ల పిల్లల ఏకాగ్రత దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. 
  • ఈశాన్య దిశలో ఉండే గదినే, పిల్లలు చదువుకోవడానికి కేటాయించడం ఉత్తమం. 
  • టేబుల్‌ దీర్ఘ చతురస్రాకారంలో లేదా చతురస్రాకారంలో ఉంటే మంచిది. రౌండ్‌ టేబుల్స్‌ వద్దు. 
  • ఈ రోజుల్లో గ్యాడ్జెట్స్‌ లేని ఇల్లు ఉండదు. చదువుకునే సమయంలో వీటిని పిల్లలకు దూరంగా పెట్టడం మంచిది. అనవసర పరికరాల లభ్యత వల్ల దృష్టి చదువుపైకంటే వాటిపైకి వెళ్తుంది. 
  • పిల్లల గదిలో ఫర్నిచర్‌ ఎట్టి పరిస్థితిలోనూ ఎరుపు రంగులో ఉండకూడదు. ఈ వర్ణం ప్రతికూల ఆలోచనా విధానాన్ని పెంచుతుంది. అంతేకాదు, పిల్లల అభ్యాసనా సామర్థ్యాలను కూడా దెబ్బతీస్తుందని అంటారు. 


logo