శుక్రవారం 22 జనవరి 2021
Realestate - Jan 02, 2021 , 00:03:59

కిటికీలూ కీలకమే

కిటికీలూ కీలకమే

కరోనా ప్రభావంతో ఇండిపెండెంట్‌, గేటెడ్‌ కమ్యూనిటీ ఇండ్లకు గిరాకీ పెరిగింది. వాటిలో వెలుతురు, గాలి బాగుంటాయి. ఈ రెండూ పుష్కలంగా పొందాలంటే ఇంకా ఏమేం చేయాలో తెలుసుకుందాం.. 

  • గాలి, వెలుతురును అందిస్తూ ఇంటికి అందాన్ని కూడా తీసుకురావడంలో కిటికీలు కీలకంగా పనిచేస్తాయి. ఇలా ఉండాలంటే కిటికీలకు ఉడెన్‌ బ్లెండ్‌లు వాడాలి. అవసరాన్నిబట్టి కొంచెం వెలుతురు, కొంచెం చీకటి ఉండేలా వీటిని అమర్చుకోవచ్చు.
  • ఫ్యాబ్రిక్‌ అల్యూమినియం, కలప వంటి మెటీరియల్‌ను ఉడెన్‌ బ్లెండ్ల తయారీలో ఉపయోగిస్తారు. అయితే ఉడెన్‌, వెదురు లాంటి కలప రకాలు ఆధునిక జీవనశైలిని కోరుకునేవారికి సరిపోతాయి. కలప రకాల్లో వెనీషియన్‌, వెర్టికల్‌, రోలర్‌ అనే రకాలు ఉన్నాయి. ఈ కిటికీలను ఇండ్లతోపాటు కార్యాలయాల్లోనూ ఏర్పాటు 
  • చేసుకోవచ్చు. 
  • సహజమైన కలప ఉడెన్‌ బ్లెండ్ల వాడకంతో ఇంటికి  అందం వస్తుంది. ముఖ్యంగా ఉడెన్‌ ఫ్లోరింగ్‌ ఉన్న గదుల్లో కిటికీల వాడకానికి ఉడెన్‌ బ్లెండ్లు చక్కగా సరిపోతాయి. వెనీషియన్‌ ఉడెన్‌ బ్లెండ్‌తో వెలుతురు కావాల్సినంత పెంచుకోవచ్చు. 
  • 25 నుంచి 50 మిల్లీ మీటర్ల వెడల్పుతో ఉండే కలప పలకలు చక్కటి ఫినిషింగ్‌తో వస్తాయి. టేకు, రబ్బర్‌వుడ్‌, దేవదారు వంటి కలపతో వీటిని తయారుచేస్తారు. ఇవి డజనుకు పైగా రంగుల్లో దొరుకుతాయి. కర్టెన్ల మాదిరిగా రంగు వెలిసిపోవడం అనే సమస్య ఉండదు. ఒకవేళ మెరుపు తగ్గినా పాలిష్‌ చేసుకుంటే సరిపోతుంది. ఇల్లు అందంగానూ మారిపోతుంది. 


logo