గురువారం 03 డిసెంబర్ 2020
Realestate - Nov 07, 2020 , 02:29:41

మైమరిపించే మార్బుల్‌ ఫర్నీచర్‌

మైమరిపించే మార్బుల్‌ ఫర్నీచర్‌

డైనింగ్‌ టేబుల్‌, టీపాయ్‌ లాంటి ఫర్నీచర్‌ కోసం కలప కావాల్సిందే. అందుకోసం చెట్లను నరకాల్సిందే. దీంతో పర్యావరణం దెబ్బతిని, కాలుష్యం పెరిగిపోతుంది. అందుకోసమే కలపకు ప్రత్యామ్నాయంగా ‘మార్బుల్‌ ఫర్నీచర్‌' మార్కెట్లను ముంచెత్తుతున్నది. చూసేందుకు ఆకర్షణీయంగా కనిపిచడంతోపాటు ఇంటికి గ్రాండ్‌ లుక్‌ను తీసుకొస్తుంది. అందుకోసమే ఇప్పుడు సంపన్న వర్గాలతోపాటు మధ్యతరగతి ప్రజలు కూడా మార్బుల్‌ ఫర్నీచర్‌ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. 

  • కలపతో పోలిస్తే మార్బుల్‌ ఫర్నీచర్‌ చాలా గట్టిగా, ఎక్కువ మన్నికగా ఉంటుంది. 
  • చెదలు పట్టడం, చీకిపోవడంలాంటి సమస్యలు రావు. 
  • రంగులు వేయడంలాంటి నిర్వహణ ఖర్చులు ఉండవు. 
  •  డైనింగ్‌ టేబుల్‌పై నీరుపడితే త్వరగా చెడిపోతుంది. అదే మార్బుల్‌ అయితే, ఎలాంటి ఇబ్బందీ ఉండదు. 
  • కలప ఫర్నీచర్‌తో పోలిస్తే ఎక్కువ డిజైన్లలో లభిస్తుంది.