గురువారం 03 డిసెంబర్ 2020
Realestate - Nov 07, 2020 , 02:30:04

నట్టింట్లో ‘సఫారీ’

నట్టింట్లో ‘సఫారీ’

గది అలంకరణ కోసమే కొందరు లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. మరికొందరు సింపుల్‌గా ఒక్క ‘వాల్‌పేపర్‌'ను అతికించేస్తారు. హాల్‌ను నిమిషాల వ్యవధిలోనే చూడచక్కగా మార్చగలిగేది ‘వాల్‌ పేపర్‌' మాత్రమే. దీని కోసం ఎక్కువ ఖర్చు, అధిక శ్రమ అవసరం కూడా లేదు. ఇంతకుముందైతే సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు, కృష్ణార్జునులకు సంబంధించిన వాల్‌పేపర్లే ఎక్కువగా కనిపించేవి. ప్రస్తుతం సరికొత్త టెక్నాలజీని ఉపయోగించి రూపొందుతున్న ‘3డీ వాల్‌ పేపర్లు’ నయా ట్రెండ్‌గా మారిపోయాయి. ఇంట్లోనే ‘ఆఫ్రికా సఫారీ’ అనుభూతిని కలిగించేలా.. మనం చూసేది నిజమైన జంతువులేనేమో అని భ్రమకల్పించేలా అనేక రకాల ‘వాల్‌ పేపర్లు’ మార్కెట్లలో లభిస్తున్నాయి. జంతు ప్రేమికులు, సఫారీలను ఇష్టపడేవారి ఇండ్లలో గోడలపై ఒదిగిపోతున్నాయి.