శనివారం 23 జనవరి 2021
Realestate - Oct 17, 2020 , 00:29:32

‘పప్పీ’లకే ప్రత్యేకంగా..

‘పప్పీ’లకే ప్రత్యేకంగా..

కుక్కలను పెంచుకోవడాన్ని అనేక మంది ఇష్టపడుతారు. కొందరు కాలక్షేపం కోసం పెంచుకుంటే, మరికొందరు స్టేటస్‌ సింబల్‌గానూ భావిస్తారు. ఇంకొందరు తమ పిల్లల కోసమే చిన్నచిన్న పప్పీలను ఇంటికి తీసుకొస్తారు. కేవలం కొనుగోలు కోసం మాత్రమే కాకుండా, వాటి పెంపకానికి కూడా భారీగానే ఖర్చు పెడుతుంటారు. ఇక ఇంట్లోని పిల్లలైతే పప్పీలకు ప్రత్యేకమైన ఆహారం పెడుతూ, రకరకాల డ్రెస్సులు వేస్తూ మురిసిపోతుంటారు. అవి పడుకునేందుకు అనుకూలంగా ఉండే మంచాలను కూడా ఏర్పాటు చేస్తుంటారు. ఇందుకోసమే మార్కెట్లలో అనేక రకాల ‘పప్పీ బెడ్స్‌' అందుబాటులో ఉన్నాయి. కొందరు రెడీమేడ్‌గా ఉన్నవాటిని కొనుగోలు చేస్తుంటే, మరికొందరు మాత్రం తమ పప్పీకి సౌకర్యవంతంగా అనిపించేలా ప్రత్యేకంగా తయారు చేయించుకుంటున్నారు. ఇంతకుముందైతే పెంపుడు కుక్కలు ఇంటి బయట ఇనుప జాలీల్లోనే ఉండేవి. ఇప్పుడు అందమైన బెడ్లలో నట్టింట్లోనే కునుకు తీస్తున్నాయి. 


logo