శుక్రవారం 30 అక్టోబర్ 2020
Realestate - Oct 10, 2020 , 00:11:54

బహురూపుల భవనం

బహురూపుల భవనం

ఈ భవనం చాలా భిన్నంగా ఉంటుంది. లోపలికి వెళ్లేముందు ఒకరకంగా కనిపిస్తే, బయటకు వచ్చేసరికి ఇంకోరకంగా మారిపోతుంది. అదే కైనటిక్‌ బిల్డింగ్‌. దీన్నే ‘ఫేస్‌ షిఫ్టింగ్‌ బిల్డింగ్‌' అని కూడా అంటారు. చైనాలోని షాంఘై నగరంలో థామస్‌ హెదర్‌విక్‌ స్టుడియో, నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థలు ఈ భవనానికి రూపకల్పన చేశాయి. దీనికి ముందుభాగంలో కదిలేందుకు వీలుగా ఉండేలా, భారీ సంఖ్యలో రాగి పైపులను ఏర్పాటు చేశారు. ఇవి ఎప్పుడూ తిరుగుతూ ఉండటం వల్ల, ఈ నిర్మాణం ఒక్కోసారి ఒక్కోరకంగా కనిపిస్తూ ఉంటుంది.