శుక్రవారం 30 అక్టోబర్ 2020
Realestate - Oct 10, 2020 , 00:11:54

అసలైన ‘బృందావనం’

అసలైన ‘బృందావనం’

హైదరాబాద్‌ మహానగరంలో అపార్ట్‌మెంట్లలో ఫ్లాటు కొనడమే గగనం. ఇక ఇండిపెండెంట్‌ ఇల్లు, డూప్లెక్స్‌ భవనాలు కొనుగోలు చేయాలంటే సంపన్నులు, భారీగా ఆదాయం వచ్చేవారికే సాధ్యం. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారిది కొనలేని పరిస్థితి. అయితే, రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఓ సంచలనంగా దూసుకొచ్చిన ‘శ్రీ సుమన్‌ గ్రూప్‌' మాత్రం ఇండిపెండెంట్‌ ఇండ్లు, డూప్లెక్స్‌ భవనాలను అతి తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొస్తున్నది. రంగారెడ్డి జిల్లా ఫారుక్‌నగర్‌ మండలం కమ్మదనం గ్రామంలో ‘బృందావనం’ పేరుతో ఇండిపెండెంట్‌ ఇండ్లు, ‘టెక్నో టౌన్‌షిప్‌' పేరుతో డూప్లెక్స్‌ భవనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. కేవలం రూ.24 లక్షలకే ఇండిపెండెంట్‌ ఇంటిని కొనుగోలుదారులకు అందిస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు, రూ.39 లక్షలకే డూప్లెక్స్‌ విల్లాను సొంతం చేసుకోవచ్చునని చెబుతున్నారు. ఇందుకోసం అక్టోబర్‌ 11, 18 తేదీ (ఆదివారాలు)లలో షాద్‌నగర్‌లో ప్రత్యేకంగా హౌసింగ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.