బుధవారం 28 అక్టోబర్ 2020
Realestate - Sep 19, 2020 , 00:17:12

దోమలను నెట్టేద్దాం

దోమలను నెట్టేద్దాం

అసలే వర్షాకాలం. దోమలు, వాటివెంటే భయంకరమైన వ్యాధులు ప్రబలే సమయం. చిన్న దోమే కదా.. అని నిర్లక్ష్యం చేస్తే, ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదం కూడా ఉన్నది. అందుకోసమే ఇంట్లోకి ఒక్క దోమ కూడా రాకుండా చూసుకోవాల్సిన అవసరమున్నది. ఇంటి నుంచి వీటిని తరిమేసేందుకు రకరకాల మస్కిటో కాయిల్స్‌, ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నా, వాటి వాసన అందరికీ పడదు. కాబట్టి దోమతెరలే సరైన పరిష్కారం. మామూలుగా కాకుండా, ఆధునికతను జోడిస్తూ.. సరికొత్త దోమతెరలను రూపొందిస్తున్నారు ఇప్పటి డిజైనర్లు. బెడ్‌పైన జాలువారేలా క్రిస్టల్‌ క్లియర్‌ పరదాలతో వీటిని డిజైన్‌ చేస్తున్నారు. విశాలమైన బెడ్రూమ్‌లోని మంచంపై ఈ తెరలను వేలాడదీస్తే, గది మొత్తం రాజమందిరాన్ని తలపిస్తుంది. రకరకాల సైజుల్లో, ఆకారాల్లో ఇవి లభిస్తున్నాయి. ముందుగా రాడ్స్‌ను మంచంపై బిగించి, వాటి మీద అందమైన దోమతెరల్ని కప్పేస్తే చాలు. ఇటు ఇల్లు అందంగా ఉండాలి.. మరోవైపు దోమల నుంచి ఉపశమనం కావాలి అనుకునేవారంతా ఇలాంటి దోమతెరలవైపే మొగ్గు చూపుతున్నారు. 


logo