బుధవారం 30 సెప్టెంబర్ 2020
Realestate - Sep 05, 2020 , 03:43:39

స్టిక్కర్స్‌ అతికించేద్దాం

స్టిక్కర్స్‌ అతికించేద్దాం

గోడలకు రంగులు వేయడం మామూలే. ఈ మధ్య వాల్‌ పెయింట్‌ అంటూ డిజైన్లు గీయిస్తున్నారు. కానీ, అవి కొంతకాలానికే బోర్‌ కొట్టేయవచ్చు. అలా పాతబడిపోయినప్పుడల్లా మార్చడానికి సరికొత్త స్టిక్కర్స్‌ వచ్చాయి. 

  • అన్ని గదులకూ ఈ స్టిక్కర్స్‌ వేయాలనుకుంటే ఒక్కో దానికి ఒక్కో థీమ్‌ తీసుకోవాలి. గోడల రంగులను దృష్టిలో పెట్టుకొని స్టిక్కర్స్‌ ఎంపిక చేసుకోవాలి. 
  • లివింగ్‌ రూమ్‌లో పూలు, తీగలు, దేవుళ్ల బొమ్మలు.. ప్రకృతికి సంబంధించినవి తీసుకోవచ్చు. గోడ కింద భాగంలో కూడా గడ్డి, పూలు ఉన్న థీమ్‌ బాగా సూటవుతుంది. 
  • వంట గదికి ప్రత్యేకంగా చెఫ్‌, గిన్నెలు, గ్లాసులు, కప్పులు, కావాలనుకుంటే పూల కుండీల్లాంటి థీమ్‌తో అలంకరించవచ్చు. ఇలా చేస్తే హెర్బల్‌ గార్డెన్‌ మీ వంట గదిలోనే ఉన్నట్లు కనిపిస్తుంది. ఇవికాకుండా.. ప్లేట్లలో వడ్డించిన పండ్లు, పలు రకాల కూరగాయల డిజైన్లు కూడా లభిస్తాయి. 
  • సీతాకోక చిలుకలు, రకరకాల పక్షుల డిజైన్ల స్టిక్కర్లు.. ఇతర థీమ్‌తో ఉన్నవాటిని డైనింగ్‌ ఏరియాలో అతికించవచ్చు. 
  • పడకగది ప్రశాంతంగా కనిపించాలంటే.. ప్రకృతికి సంబంధించిన థీమ్‌ ఎంచుకోండి. 
  • ఇక పిల్లల పడక గది విషయానికొస్తే.. వారికి నచ్చిన కార్టూన్‌ క్యారెక్టర్లను అతికించండి. మంచి మాటలు, ఇతర పువ్వుల డిజైన్లు వారికి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. 


logo