సోమవారం 30 నవంబర్ 2020
Realestate - Aug 15, 2020 , 01:28:07

‘అశోకా’ నుంచి మరో అద్భుతం..

‘అశోకా’ నుంచి మరో అద్భుతం..

రెండు తెలుగు రాష్ర్టాల్లోనూ రియల్‌ రంగంలో తిరుగులేని ‘అశోకా డెవలపర్స్‌ అండ్‌ బిల్డర్స్‌'.. మరో అద్భుత ప్రాజెక్టును ప్రారంభించబోతోంది. పచ్చదనంతో నిండిన పరిసరాలు, మెరుగైన రవాణా సదుపాయాలు, స్థిరమైన అభివృద్ధితో దూసుకెళ్తున్న కొంపల్లిలో ‘అశోకా అ-ల-మేసన్‌' పేరుతో లగ్జరీ విల్లాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. చుట్టూ పచ్చదనం, ప్రశాంత వాతావరణం కోరుకునేవారి కోసం ‘అశోకా డెవలపర్స్‌ అండ్‌ బిల్డర్స్‌ సంస్థ’ డైరెక్టర్‌ ఎన్‌.జయ్‌దీప్‌ రెడ్డి ఈ వెంచర్‌కు శ్రీకారం చుట్టారు. మొత్తం 65 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన ఈ బృహత్తర ప్రాజెక్టులో పచ్చదనానికి పెద్దపీట వేశారు. దాదాపు 65శాతం ఓపెన్‌ స్పేస్‌కే కేటాయించి, మిగతా 35శాతం ప్రాంతంలో డూప్లెక్స్‌ విల్లాల నిర్మాణం చేపట్టారు. 10 ఎకరాల్లో పార్కులు, చెట్లను ఏర్పాటు చేశారు. మంజీరా నీటితోపాటు అధునాతన హైడ్రో న్యూమెటిక్‌ పంపింగ్‌ ద్వారా నీటి సరఫరా సౌకర్యం కల్పిస్తున్నారు. పటిష్టమైన భద్రతా చర్యలు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ సిస్టమ్‌తోపాటు నీళ్లు, విద్యుత్‌ కూడా అండర్‌ గ్రౌండ్‌లోనే ఏర్పాటు చేశారు. 80, 60, 40 అడుగుల అంతర్గత రహదారులు, నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా విల్లాలను నిర్మించారు. సాయంత్రాల్లో సేదతీరేందుకు ఆటస్థలాలతోపాటు క్లబ్‌ హౌస్‌ స్విమ్మింగ్‌ ఫూల్‌, ఏరోబిక్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. సూపర్‌ మార్కెట్‌, ఫార్మసీ కేంద్రాలను కూడా అందుబాటులో ఉంచారు.