గురువారం 13 ఆగస్టు 2020
Realestate - Jul 25, 2020 , 00:11:18

మస్త్‌ మస్త్‌..

మస్త్‌ మస్త్‌..

ఆధునిక యుగంలో వంటింటి ప్రాధాన్యం పెరిగింది. తినే తిండిలో కొత్తకొత్త రుచులను కోరుకుంటున్నట్టే.. వాటిని తయారు చేసే కిచెన్‌ కూడా సరికొత్తగా ఉండాలని నేటితరం ఆశిస్తున్నది. ఒకప్పుడు హాల్‌.. బెడ్‌రూమ్‌ లగ్జరీగా ఉంటే చాలనుకునేవారు. కానీ, ఇప్పుడు వంటగదిని కూడా వండర్‌ఫుల్‌గా తీర్చిదిద్దుకుంటున్నారు. ఎందుకంటే.. ఇంటికి వంటగదే గుండెకాయ. ఆ గది ఎంత బాగుంటే.. ఇంట్లోని వారు అంత ఆరోగ్యంగా ఉంటారు. అందుకే అభిరుచికి.. సౌకర్యాన్ని జోడించి కిచెన్‌ను రూపొందించుకోవాలి. 

మాడ్యులర్‌ కిచెన్‌ 

ఎల్‌-షేప్డ్‌ కిచెన్‌..

చిన్న ఇండ్లలో ఎల్‌- షేప్‌ కిచెన్‌లు బాగుంటాయి. పైగా ఇలాంటివి ఏర్పాటు చేసుకోవడం వల్ల గది మరింత పెద్దగా కనిపిస్తుంది. రెండు గోడలను కలుపుతూ వచ్చేలా ఈ డిజైన్‌ ఉంటుంది.  సింగిల్‌ యూనిట్‌తో వస్తుంది కాబట్టి మధ్యలో చిన్న డైనింగ్‌ టేబుల్‌ వేసుకోవచ్చు.

సమాంతరంగా.. 

మహిళలకు రోజంతా వంటగదిలోనే గడుస్తుంది. అలాంటి వారికి సమాంతర మాడ్యులర్‌ కిచెన్‌ లే అవుట్‌ సరిగ్గా సరిపోతుంది. రెండు వర్క్‌ స్టేషన్లు సెపరేట్‌గా ఉండి, రెండు గోడలకూ వ్యతిరేక దిశలో ఉంటాయి. ఎక్కువ వంటలు చేసేవారికి ఇది బాగుంటుంది. 

యూ-షేప్‌.. 

వంటగది పెద్దదైతే యూ-షేప్‌ కిచెన్‌  సరిపోతుంది. దీన్ని రకరకాలుగా విభజించవచ్చు. వండుకోవడానికి, కూరగాయలను కడుక్కోవడానికి.. ఇలా ప్రత్యేకంగా వర్క్‌స్టేషన్‌ని పెట్టుకోవచ్చు. సామగ్రి బయటకు కనపడకుండా స్టోర్‌ చేసుకోవచ్చు. 


ఐ-ల్యాండ్‌.. 

చుట్టూ నీళ్లు ఉండి మధ్యలో ఒక దీవి ఎలా ఉంటుందో.. ఈ కిచెన్‌ డిజైన్‌ కూడా అలాగే ఉంటుంది. కిచెన్‌ ైస్టెలిష్‌గా ఉండాలని కోరుకునేవాళ్లకు ఇది గుడ్‌ చాయిస్‌. ఎల్‌-షేప్డ్‌.. రేఖలా ఉండే కిచెన్‌తోపాటు దీన్ని డిజైన్‌ చేసుకోవచ్చు. మధ్యలో కేవలం స్టౌ వస్తుంది. దీన్ని భోజనం ప్రిపేర్‌ చేసేందుకు వాడుకోవచ్చు. 

ఒకే రేఖగా.. 

గది పెద్దదైనా.. చిన్నదైనా సరే.. కిచెన్‌ గజిబిజిగా లేకుండా ఉండాలనుకుంటే ఇలాంటి కిచెన్‌ని ఎంచుకోవచ్చు. సింక్‌, ఫ్రిజ్‌, క్యాబినెట్స్‌.. అన్నీ కూడా ఒకే గోడకు వచ్చేస్తాయి. చివరకు స్టౌ కూడా ఇదే లైన్‌లో ఉంటుంది. దీనికి ఎక్కువ స్థలం కూడా అవసరం ఉండదు. 

జీ-షేప్‌.. 

ఐల్యాండ్‌ షేప్‌ కిచెన్‌కి ఇది కాస్త దగ్గరగా ఉంటుంది. నాలుగువైపులా కిచెన్‌ బ్రాంచ్‌ ఉంటుంది కాబట్టి.. దానికి అనుగుణంగా డిజైన్‌ చేసుకోవచ్చు. ఓపెన్‌ కిచెన్‌ కోరుకునేవారు  దీనిని చేయించుకోవచ్చు. 


logo