సోమవారం 25 మే 2020
Realestate - Mar 21, 2020 , 00:41:31

లిఫ్టు ఇలా వాడాలి

లిఫ్టు ఇలా వాడాలి

మ్యానువల్‌ డోర్లు ఉన్న లిఫ్టులను తెరవాల్సి వచ్చినా, మూసేయాలన్న చేతులను వాడాల్సిందే. ఇలాంటి లిప్టులను వాడేవారు మర్చిపోకుండా శానిటైజర్‌ను వినియోగించాలి. ఎందుకంటే, ఐరన్‌ మీద ఆరు నుంచి ఎనిమిది గంటల దాకా కరోనా వైరస్‌ ఉంటుందనే విషయాన్ని మర్చిపోవద్దు. 

లిఫ్టు ఎక్కేవారు వేలు మడిచి బటన్‌ నొక్కాలి

లిఫ్టులోకి ప్రవేశించిన తర్వాత హ్యాండిల్‌ను పట్టుకోకూడదు. 

వీలైనంత వరకూ లిఫ్టును శానిటైజర్‌ ద్వారా క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. 

నివాసిత సంఘాలు లిఫ్టు ఉండే గ్రౌండ్‌ ఫ్లోరులో శానిటైజర్‌ ఏర్పాటు చేస్తే ఉత్తమం.

లిఫ్టులోని ఫ్యాను నిత్యం తిరుగుతూ ఉండేలా చూడాలి. దీంతో ఫ్యాను పాడు కాదు. లోపలి గాలి బయటికి వెళ్లిపోతుంది. 


logo