శుక్రవారం 05 జూన్ 2020
Realestate - Feb 28, 2020 , 22:16:42

ఈ-వేస్ట్‌ పెద్ద ముప్పు

ఈ-వేస్ట్‌ పెద్ద ముప్పు

మనిషి జీవితంలో ఎలక్ట్రానిక్‌ పరికరాలూ ఒక భాగమై పోయాయి. మొబైల్‌ ఫోన్లు, కంప్యూటర్లు, టీవీల వంటి ఎలక్ట్రానిక్‌ వస్తువుల వాడకంతో వ్యర్థాల ఉత్పత్తి ప్రమాదకరస్థాయి చేరుకుంటున్నాయి. ఫలితంగా, పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుతున్నది. ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల వల్ల కలిగే ముప్పుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నదని ఇటీవల నగరంలో జరిగిన ఓ సదస్సులో వక్తలు అభిప్రాయపడ్డారు.


2001లో 310 మిలియన్ల మంది మొబైల్‌ ఫోన్ల వినియోగదారులుంటే, 2019 నాటికి 1.16 బిలియన్లకు చేరుకున్నది. భారతదేశంలో మొబైల్‌ ఫోన్ల వినియోగదారుల సంఖ్య అమెరికా కంటే దాదాపు 4 రెట్లు ఎక్కువైంది. మొబైల్‌ ఫోన్ల వినియోగదారుల్లో 1.3 బిలియన్లతో చైనా మొదటి స్థానంలో ఉండగా, భారతదేశం రెండో స్థానంలో నిలిచింది. దేశంలో 57 మిలియన్ల మంది కంప్యూటర్లతో పాటు ఇతర గాడ్జెట్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులను వాడుతున్నారు. ఈ-వేస్ట్‌ వల్ల కలిగే దుష్పరిణామాలు, కాలుష్యం, ఈ-వ్యర్థాల రీసైక్లింగ్‌ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 


గత పదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఈ-వేస్ట్‌ సమస్యగా మారింది. మన వద్ద 4 మిలియన్‌ టన్నులతో అధిక శాతం అసంఘటిత రంగమే ఉత్పత్తి చేస్తున్నది. కంప్యూటర్లు, మొబైల్‌ ఫోన్లే ప్రధాన ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలకు కారకాలని ఎలక్ట్రానిక్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా గుర్తించింది.  ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల్లో 70 శాతం కంప్యూటర్లు కారణంగా కాగా, 12 శాతం టెలీకమ్యూనికేషన్‌ పరికరాలు కారణమవుతున్నాయి. ముంబైలో ఏటా 1,20,000 టన్నుల ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఢిల్లీ 98,000 టన్నులు, బెంగళూరు 92,000 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి చేస్తున్నాయి. హైదరాబాద్‌ వార్షికంగా 50 వేల టన్నుల ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నది. 


logo