బుధవారం 03 జూన్ 2020
Realestate - Feb 28, 2020 , 22:14:39

పెట్టుబడుల్లో పెరుగుదల

పెట్టుబడుల్లో పెరుగుదల

భారతదేశంలో ప్రాపర్టీ టెక్నాలజీపై పెట్టుబడి రోజురోజుకూ పెరుగుతున్నది. 2018లో 3.4 మిలియన్‌ డాలర్ల మేరకు ప్రాప్‌టెక్‌లో పెట్టుబడి పెట్టగా 2019 నాటికి 56.8 మిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. ఒక ఏడాదిలోనే ప్రాప్‌టెక్‌ పెట్టుబడులు 17 రెట్లు పెరగడం విశేషం. 2019లో ఆసియా పసిఫిక్‌లో ప్రాప్‌టెక్‌ స్టార్టప్‌లు వారి నిధుల క్షీణతను 38.4 శాతం తగ్గించాయి. జేఎల్‌ఎల్‌, టెక్‌ మీడియా సంస్థ నిర్వహించిన టెక్‌ ఇన్‌ ఆసియా పరిశోధనల ప్రకారం.. గత సంవత్సరం ఆసియా పసిఫిక్‌లో ప్రాప్‌టెక్‌ స్టార్టప్‌లు 625.9 మిలియన్‌ డాలర్లను సేకరించాయని తేలింది. డీల్‌ కౌంట్‌లో 2018లో జరిగిన 50 ఒప్పందాలతో పోలిస్తే 2019లో 38 ఒప్పందాలకు పడిపోయింది. భారతదేశంలో ప్రాప్‌టెక్‌ స్టార్టప్‌ల నిధులు 12 మిలియన్‌ డాలర్ల నుంచి 26.1 మిలియన్‌ డాలర్లకు పెరిగాయి. దీంతో సంవత్సరానికి 117.5 శాతం పెరిగినట్టు తేలింది. 


logo