సోమవారం 25 మే 2020
Realestate - Feb 21, 2020 , 22:53:08

అన్ని రకాల గృహాలకు ఆవాస్‌

అన్ని రకాల గృహాలకు ఆవాస్‌
  • డెవలపర్లు తమ ప్రాజెక్టులు నమోదు చేసుకోవాలి
  • క్రెడాయ్‌ తెలంగాణ అధ్యక్షుడు సీహెచ్‌ రామచంద్రారెడ్డి

భారతదేశంలో క్రెడిబుల్‌ ప్రాజెక్టులను నిర్మించే క్రెడాయ్‌ నేషనల్‌ తాజాగా ‘క్రెడాయ్‌ ఆవాస్‌' యాప్‌ను అందుబాటులోకి తెచ్చిందని.. దేశవ్యాప్తంగా క్రెడాయ్‌ డెవలపర్ల ప్రాజెక్టుల సమాచారం ఇందులో లభిస్తుందని.. సొంతిల్లు కొనుక్కునేవారు ఒక్కసారి ఈ యాప్‌లోకి వెళితే.. అన్నిరకాల ప్రాజెక్టుల సమాచారం తెలుసుకోవచ్చని క్రెడాయ్‌ తెలంగాణ అధ్యక్షుడు చెరుకు రామచంద్రారెడ్డి తెలిపారు. ప్రస్తుతం క్రెడాయ్‌ తెలంగాణలో పదకొండు ఛాప్టర్లు ఉన్నాయని.. బిల్డర్లందరూ తమ ప్రాజెక్టులను ‘క్రెడాయ్‌ ఆవాస్‌' యాప్‌లో నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. 


మనదేశంలో క్రెడాయ్‌ డెవలపర్ల వద్ద ఫ్లాట్లు కొనుగోలు చేస్తే నిశ్చింతగా ఉండొచ్చని రామచంద్రారెడ్డి అన్నారు. ఇతర వెబ్‌సైట్లతో పోల్చితే ఇందులో మధ్యవర్తులు ఉండరని తెలిపారు. క్రెడాయ్‌ ఆవాస్‌ యాప్‌లోకి వెళితే.. ఫ్లాట్లను సులభంగా ఎంచుకోవచ్చని చెప్పారు. బయ్యర్లే నేరుగా ఫ్లాట్లను ఎంపిక చేసుకోవచ్చన్నారు. 2017 జనవరి 1 నుంచి తెలంగాణలో రెరా అమల్లోకి వచ్చిందని.. కాకపోతే, అం తకు ముందునుంచే క్రెడాయ్‌ సభ్యులు కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ను పాటిస్తున్నారని తెలిపారు. 


క్రెడాయ్‌ ఆవాస్‌లో కేవలం రెరా అనుమతి పొందిన ప్రాజెక్టుల సమాచారం మాత్రమే లభిస్తుంద న్నారు. తెలంగాణలో నివసించేవారు బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో ఫ్లాట్లు కొనుగోలు చేయాలన్నా క్రెడాయ్‌ ఆవాస్‌ ద్వారా సులభతరం అవుతుందన్నారు. దేశంలోని ఇతర నగరాల్లో నివసించేవారు హైదరాబాద్‌లో ఈ యాప్‌ ద్వారా సులువుగా ఇండ్లను కొనుగోలు చేయవచ్చని తెలిపారు. ఈ యాప్‌ ప్రత్యేకత ఏమిటంటే.. ఇండ్లను కొనాలని భావించేవారు.. నేరుగా నిర్మాణ సంస్థలను సంప్రదించే వీలు కలుగుతుందని వివరించారు. మధ్యవర్తులతో సంబంధం ఉండదన్నారు. క్రెడాయ్‌ బిల్డర్ల వద్ద కొనుగోలు చేస్తే ఎలాంటి సమస్యలు ఎదురు కావు. ఈ అంశాన్ని అర్థం చేసుకున్నాకే చాలామంది కొనుగోలుదారులు క్రెడాయ్‌ సభ్యుల వద్ద ఫ్లాట్లను కొనడానికి ముందుకొస్తున్నారు. ఇలాంటి వారందరికీ క్రెడాయ్‌ ఆవాస్‌ యాప్‌ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. 


logo