బుధవారం 03 జూన్ 2020
Realestate - Feb 21, 2020 , 22:47:33

వర్టూసా గేటెడ్‌ కమ్యూనిటీలు

వర్టూసా గేటెడ్‌ కమ్యూనిటీలు

ఇండ్లు కొనుగోలు చేయాలనుకునే వారెవరైనా అభివృద్ధికి ఆస్కారమున్న ప్రాంతాల్లో.. ఆధునిక సౌకర్యాలున్న వెంచర్లకే ప్రాధాన్యమిస్తున్నారు. అలాంటి వారికోసం వర్టూసా లైఫ్‌ స్పేసెస్‌ నగరంలో పలు గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. కొనుగోలుదారుల అభిరుచికి తగ్గట్టుగా పలు ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా వర్టూసా టక్సెడో పార్కు పేరిట షాద్‌నగర్‌లో సరికొత్త వెంచర్‌ను ప్రారంభించింది. ఇందులో ఆధునిక సౌకర్యాలతో కూడిన నివాసాలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చేపడుతున్న ప్రాజెక్టులకు ఈ వెంచర్‌ ఒక ట్రెండ్‌ సెట్టర్‌గా నిలుస్తుందని వర్టూసా సంస్థ చెబుతున్నది. 


ప్రపంచస్థాయి వసతులతో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టు రిసార్ట్‌ వంటి అనుభూతిని కలిగిస్తుంది. ఈ ప్రాజెక్టులో అత్యుత్తమ సౌకర్యాలతో కూడిన క్లబ్‌ హౌస్‌ను నిర్మిస్తున్నారు. ఇది ప్రాజెక్టుకే ప్రధానాకర్షణగా నిలుస్తున్నది. దీంతోపాటు స్విమ్మింగ్‌ పూల్‌, జిమ్‌, మల్టీ పర్పస్‌ హాల్‌, చిల్డ్రన్స్‌ ప్లే ఏరియా, గెస్ట్‌ రూము, కాఫీ షాపు, లైబ్రరీలను ప్రత్యేకమైన డిజైన్‌లో తీర్చిదిద్దుతున్నారు. 


వర్టూసా స్పేసెస్‌ నిర్మాణ సంస్థ ఇప్పటికే కొంపల్లిలో వర్టుసా ఐకానా మిడోస్‌ పేరుతో ఒక ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసింది. 45 ఎకరాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా రెసిడెన్షియల్‌ విల్లాలు, ప్లాట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్టు ఔటర్‌ రింగు రోడ్డుకు అతిచేరువలో ఉండటం విశేషం. దీంతోపాటు షాద్‌నగర్‌ టౌన్‌లో వర్టూసా లోర్నా గ్రీన్స్‌ పేరుతో మరో ప్రాజెక్టును ప్రారంభించింది. మోకిలా దగ్గరల్లోని శంకర్‌పల్లిలో వర్టూసా సైనోజర్‌ పేరుతో మరో ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. అధునాతన సౌకర్యాలతో ఈ ప్రాజెక్టుల్లోని రెసిడెన్షియల్‌ విల్లాలను, ప్లాట్లను తీర్చిదిద్దుతున్నారు.


logo