ఆదివారం 23 ఫిబ్రవరి 2020
స్వాంతన ఆరోగ్య గ్రామం

స్వాంతన ఆరోగ్య గ్రామం

Feb 14, 2020 , 22:36:45
PRINT
స్వాంతన ఆరోగ్య గ్రామం

సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి ప్రతిరోజు పరుగులు పెడుతూ.. జీవితాన్ని ఒత్తిడిమయం చేసుకుంటున్నారా? ట్రాఫిక్‌ రణగొణ ధ్వనుల్లో ప్రయాణం చేస్తూ జీవితం నరకప్రాయం అవుతున్నదా? రకరకాల మానసిక రుగ్మతలు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయా? జీవనశైలి సమస్యలతో సరికొత్త ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారా?

ఇలాంటి సమస్యలను ఎదుర్కొనేవారికి స్వాంతన చేకూర్చేందుకు.. సహజ వైద్యంతో చికిత్సను అందించడానికి.. ప్రగతి గ్రూపు ప్రప్రథమంగా ‘స్వాంతన ఆరోగ్య గ్రామం’కు శ్రీకారం చుట్టింది. చిలూకురు బాలజీ టెంపుల్‌ రోడ్డులోని ప్రగతి రిసార్ట్స్‌లో ఏర్పాటైన స్వాంతనను శనివారం చినజీయర్‌ స్వామి ఆరంభిస్తారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఈటెల రాజేందర్‌, వి.శ్రీనివాస్‌ గౌడ్‌, చేవేళ్ల ఎంపీ డా.రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య తదితరులు పాల్గొంటారని ప్రగతి సంస్థ తెలియజేసింది. ప్రముఖ యూరాలజిస్ట్‌, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్‌ బి.నాగరాజు పర్యవేక్షణలో ఈ సహజసిద్ధమైన చికిత్స కేంద్రం పని చేస్తుంది. జీవనశైలిలో వస్తున్న మార్పుల వల్ల ఎదురయ్యే మానసిక రుగ్మతలకు ఇందులో చికిత్స లభిస్తుందని ప్రగతి గ్రూప్‌ చెబుతున్నది. 


logo