ఆదివారం 23 ఫిబ్రవరి 2020
2019లో 6.2 బిలియన్ల పీఈ

2019లో 6.2 బిలియన్ల పీఈ

Feb 14, 2020 , 22:33:37
PRINT
2019లో 6.2 బిలియన్ల పీఈ

భారతీయ రియల్‌ ఎస్టేట్‌ రంగం 2019 లో 6.2 బిలయన్‌ డాలర్ల (రూ. 43,704 కోట్లు) ప్రైవేట్‌ ఈక్విటీ పెట్టుబడులను ఆకర్షించింది. సంస్థాగత పెట్టుబడిదారుల ఆసక్తి అనుగుణంగా ఆఫీసు స్థలాల మీదే ప్రధానంగా పీఈ సంస్థలు పెట్టుబడుల్ని పెట్టాయి. గతేడాది నుంచి దేశంలో రియల్‌ రంగంలో మొత్తం పెట్టుబడి.. 3 శాతం పెరిగింది. 2019లో  ఆఫీసు విభాగం సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి 3.1 బిలియన్‌ డాలర్లను ఆకర్షించింది. సంవత్సరంలోని మొత్తం పెట్టుబడుల్లో 50.1 శాతం ఆఫీసు విభాగంలోనే కాగా, మొత్తం పెట్టుబడిలో 72.9 శాతం విదేశీ పెట్టుబడిదారులు నుంచి వచ్చినవే కావడం విశేషం. 2018లో 64 శాతంగా ఉన్న ఈక్విటీ క్యాపిటల్‌ నిధులు 2019 కల్లా 80.5 శాతానికి పెరిగింది. రూ.43,704 కోట్లకు చేరుకున్న పీఈ పెట్టుబడులు భారతీయ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌పై సంస్థాగత పెట్టుబడిదారులకు గల విశ్వాసాన్ని స్పష్టం చేస్తుంది. వాణిజ్య రంగంలో బలమైన డిమాండ్‌ ఉన్నందున ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పెట్టబడిదారులు ఆసక్తి చూపుతున్నారు. పెట్టుబడి ఒప్పందాల సంఖ్య  17 శాతం తగ్గింది. ఇది రూ.వెయ్యి కోట్ల విలువైన పెద్ద పరిమాణ లావాదేవీల పెరుగుదలను సూచిస్తుంది. విదేశీ పెట్టుబడిదారులు, దేశీయ సంస్థల మధ్య జాయింట్‌ వెంచర్లు దీర్ఘకాలికంగా ఈ రంగంలో పెట్టుబడి పెడుతున్నాయి.  


logo