శనివారం 29 ఫిబ్రవరి 2020
అల.. అశోకామైసన్‌లో..

అల.. అశోకామైసన్‌లో..

Feb 07, 2020 , 23:19:55
PRINT
అల.. అశోకామైసన్‌లో..

లగ్జరీ గృహాల్లో నివసించాలని కలలు కనేవారికి అశోకా బిల్డర్స్‌ అందించే చక్కటి ఆప్షన్‌.. అ-లా-మైసన్‌. కొంపల్లిలో రూపుదిద్దుకున్న ఈ పాజెక్టును చూస్తే ఎవరైనా ఎగిరి గంతేయాల్సిందే. రిసార్టును తలపిస్తూ.. నివాసితులకు ప్రశాంతతను కలిగిస్తూ.. కొంపల్లిలో అత్యాధునికంగా ముస్తాబైన ప్రాజెక్టే.. అ-లా- మైసన్‌.అశోకా బిల్డర్స్‌ వద్ద విల్లా కొనుగోలు చేస్తే భవిష్యత్తులో ఎలాంటి బాదరాబందీల్లుండవని కొనుగోలుదారులు భావిస్తుంటారు. అందుకే, అశోకా సంస్థ ఎక్కడ ప్రాజెక్టును ప్రారంభించినా తమ ప్రత్యేకతను చాటి చెబుతుంది. కొంపల్లిలో దాదాపు 65 ఎకరాల్లో నిర్మించిన అ-లా-మైసన్‌ ప్రాజెక్టును చూస్తే ఈ విషయం ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. జాతీయ రహదారులు, ఓఆర్‌ఆర్‌తో చక్కని రవాణా అనుసంధానం కలిగిన కొంపల్లిలో చేపట్టారు. ఇక్కడ్నుంచి సుచిత్రా సర్కిల్‌కు సులువుగా చేరుకోవచ్చు. దీనికి సమీపంలో అధిక సంఖ్యలో వాణిజ్య సముదాయాలు, షాపింగ్‌ మాళ్లు, స్కూళ్లు, కాలేజీలు, రెస్టారెంట్లు ఏర్పాటయ్యాయి. ఓక్రిడ్జ్‌, డీఆర్‌ఎస్‌, డీపీఎస్‌, జైన్‌ ఇంటర్నెషనల్‌ స్కూళ్లతో పాటు బాలాజీ, హర్ష వంటి హాస్పిటల్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఎంఎంటీఎస్‌, మెట్రో రైలు వంటి రవాణా సౌకర్యం ద్వారా తక్కువ సమయంలోనే నగరానికి చేరుకోవచ్చు.

ఎంతెంత దూరం?

అ-లా-మైసన్‌ నుంచి ఓఆర్‌ఆర్‌ కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ్నుంచి ప్యారడైజ్‌ పదమూడు కిలోమీటర్లు, జేఎన్‌టీయూ నుంచి 14 కి.మీ, హైటెక్‌సిటీకి 20 కి.మీ. దూరంలో ఏర్పాటైంది. ఈ ప్రాజెక్టులో అన్ని రకాల ఆధునిక సదుపాయాలు కలిగి ఉండటం విశేషం.

క్లబ్‌హౌస్‌ ప్రధాన ఆకర్షణ..

ఈ ప్రాజెక్టులో నిర్మిస్తున్న క్లబ్‌ హౌస్‌ను ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు.
20 వేల చ.అ విస్తీర్ణంలో పూర్తి స్థాయిలో ఏసీ సౌకర్యం
కిడ్స్‌పూల్‌తో కూడిన స్విమ్మింగ్‌పూల్‌
ఆధునిక జిమ్‌, యోగా, మెడిటేషన్‌ హాల్‌, స్పా అండ్‌ సెలూన్‌
కాఫీ షాప్‌, లాంజ్‌
లైబ్రరీ, మీటింగ్‌ రూం
ఇండోర్‌ స్కాష్‌ అండ్‌ బ్యాడ్మింటన్‌ కోర్టు
అవుట్‌డోర్‌ టెన్నిస్‌, బాస్కెట్‌బాల్‌, వాలీబాల్‌ కోర్టులు
యాంఫీథియేటర్‌, బాంకెట్‌ హాల్‌, పార్టీ లాంజ్‌

65 ఎకరాల్లో సూపర్‌ ప్రాజెక్టు

ఆధునిక  నిర్మాణాల్లో నివసించాలని కోరుకునేవారి కోసం 65 ఎకరాల్లో ప్రీమియం విల్లాస్‌ కమ్యూనిటీని తీర్చిదిద్దుతున్నాం. 65 శాతం ఓపెన్‌ స్పేస్‌, 35 శాతం బిల్టప్‌ ఏరియాగా నిర్మిస్తున్నాం. 10 ఎకరాల్లో పార్కులు, లంగ్‌ స్పేసెస్‌కు కేటాయించాం. వంద శాతం పవర్‌ బ్యాకప్‌ ఉంటుంది. అతిథులకు ప్రత్యేక రూములు, సూపర్‌ మార్కెట్‌, ఫార్మసీ వంటివి అందుబాటులో ఉంటాయి.
- ఎన్‌. జైదీప్‌ రెడ్డి, డైరెక్టర్‌, అశోకా బిల్డర్స్‌


logo