శనివారం 29 ఫిబ్రవరి 2020
క్రెడిట్‌ స్కోరే కీలకం..

క్రెడిట్‌ స్కోరే కీలకం..

Feb 07, 2020 , 23:17:30
PRINT
క్రెడిట్‌ స్కోరే కీలకం..

గృహరుణం లేనిదే సొంతింటి కలను సాకారం చేసుకోవడం సాధ్యం కాదు. ఈ విషయం దాదాపు మధ్యతరగతి, వేతనజీవులందరికీ తెలిసిందే. మన కుటుంబానికి అన్ని విధాలుగా నప్పే ప్రాజెక్టు లభించగానే.. గృహరుణానికి సంబంధించిన పలు ముఖ్యమైన విషయాలపై తప్పకుండా అవగాహన పెంచుకోవాలి. గృహ రుణ గరిష్ఠ పరిమితి ప్రధానంగా వయో పరిమితిపై ఆధారంగా ఉంటుంది. స్వయం ఉపాధి పొందుతున్న వారైతే 24 నుంచి 65 ఏండ్ల వరకు, నెలవారీ జీతానికి పని చేస్తున్న వారికైతే 60 ఏండ్ల వరకు వయోపరిమితి ఆధారంగా రుణమిస్తారు. గృహ రుణం దరఖాస్తు దారుని నికర ఆదాయంపై కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే తమ ఆర్థికస్థితి ఓపద్ధతి ప్రకారం నిర్వహించడానికి ప్రయత్నించాలి.

చలన వడ్డీ రేటే మేలా?

వడ్డీరేటులో బ్యాంకుల మధ్య వ్యత్యాసం ఉంటుంది. గృహరుణం తీసుకునే ముందు రేటు తెలుసుకుని, పోల్చుకోవడం చాలా అవసరం. స్థిర వడ్డీరేటు, చలన వడ్డీరేటు వంటి రెండు రకాలుంటాయి. స్థిరమైన వడ్డీ రేటు ప్రకారం మార్కెట్‌ హెచ్చు తగ్గుల వల్ల ఎలాంటి సమస్యా ఉండదు. రుణ వ్యవధిలో రుణాన్ని స్థిర వాయిదాలో తిరిగి చెల్లించాలి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిర్ణయించే రేటులో హెచ్చుతగ్గుల కారణంగా వడ్డీ రేటు కూడా మారుతుంది. అలాంటప్పుడు స్థిరమైన వడ్డీ రేటు కంటే తక్కువ వడ్డీరేటు లభించే అవకాశం ఉంది. నెలవారీ ఈఎంఐలు ప్రామాణిక పద్ధతిలో ఉంటాయి. ఆర్‌బీఐ రుణ రేటు పెరిగితే ఈఎంఐలో కూడా మారుతుంది.

వ్యవధి ఎంతుండాలి?

ఈఎంఐలు ప్రధానంగా గృహ రుణం పూర్తయ్యే కాలంపై ఆధారపడి ఉంటుంది. దీర్ఘకాలిక ఈఎంఐ, స్వల్ప కాలిక ఈఎంఐల మధ్య ఉన్న వ్యత్యాసం ప్రజలకు తెలియదు. రుణం పూర్తయ్యే కాలం తక్కువగా ఉన్నప్పుడు వాయిదాలో చెల్లించే మొత్తం పెరగొచ్చు. కానీ చివరి దశలో రుణం సులువుగా చెల్లించవచ్చు. దీర్ఘకాలంలో పూర్తయ్యే ఈఎంఐలకు పెద్ద మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

క్రెడిట్‌ స్కోర్‌ కీలకం

గృహ రుణ దరఖాస్తుదారుల్లో క్రెడిట్‌ స్కోర్‌ కీలక పాత్ర పోషిస్తుంది. గృహ రుణం కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత బ్యాంకులు వారి క్రెడిట్‌ స్కోర్‌ను పరిశీలిస్తాయి. క్రెడిట్‌ స్కోర్‌ ఆధారంగా రుణం మంజూరు చేయాలో లేదో నిర్ణయించుకుంటాయి. క్రెడిట్‌ స్కోర్‌ 350 నుంచి 900 వరకు మారుతూ ఉంటుంది.

సంతకం ముందే..

నిబంధనలు-షరతులతో గృహ రుణం తీసుకున్నప్పుడు మరింత జాగ్రత్త అవసరం. పత్రాలపై సంతకం చేయడానికి ముందే క్షుణ్ణంగా వాటిని పరిశీలించాలి. నిబంధనలు, షరతుల పట్ల జాగ్రత్త వహిస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఉండదు.


logo