శుక్రవారం 05 జూన్ 2020
Realestate - Feb 01, 2020 , 00:47:24

మీ ప్రాపర్టీ షో.. మీరే విన్వెస్టర్‌

మీ ప్రాపర్టీ షో.. మీరే విన్వెస్టర్‌

దేశవ్యాప్తంగా క్రెడాయ్‌ సంస్థకు ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. స్థానిక సంస్థల నుంచి అనుమతులన్నీ పక్కాగా తీసుకున్న ప్రాజెక్టులను మాత్రమే క్రెడాయ్‌ డెవలపర్లు ప్రదర్శిస్తారని కొనుగోలుదారులకు పక్కాగా నమ్మకం ఉన్నది. పైగా, ఈ సంఘానికి చెందిన బిల్డర్లు ‘రెరా’ నిబంధనల్ని కచ్చితంగా పాటిస్తారని బయ్యర్లకు తెలుసు. అందుకే, క్రెడాయ్‌ ప్రాపర్టీ షో ఎక్కడ జరిగినా గ్రాండ్‌ సక్సెస్‌ అవుతుంది. ఈ క్రమంలో క్రెడాయ్‌ హైదరాబాద్‌ నైన్త్‌ ఎడిషన్‌ ప్రాపర్టీ షోకు శ్రీకారం చుట్టింది. శుక్రవారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా హైటెక్స్‌లో ఈ ప్రాపర్టీ షో అట్టహాసంగా ఆరంభమైంది. నేడు, రేపు జరిగే ఈ ప్రాపర్టీ షోకు విచ్చేస్తే చాలు.. నగరంలోని లైఫ్‌ స్టయిల్‌ గృహాలు సమాచారం సులువుగా తెలుసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం? లగ్జరీ ప్రాజెక్టుల వివరాల్ని క్షుణ్నంగా తెలుసుకుని, వెంటనే మీకు నచ్చిన ప్లాటు, ఫ్లాటు, విల్లాను వెంటనే బుక్‌ చేసుకోండి. 


కింగ్‌ జాన్సన్‌ కొయ్యడ

క్రెడాయ్‌ ప్రాపర్టీ షో వచ్చిందంటే చాలు.. హైదరాబాద్‌లో కొనుగోళ్ల పండగ షురూ అయినట్లే లెక్క. ఎందుకంటే, ఇలాంటి ప్రాపర్టీ షో మళ్లీ ఈ ఏడాదిలో వచ్చే అవకాశమే లేదు. ఇటీవల కేటీఆర్‌ దావోస్‌ పర్యటన విజయవంతమైంది. పిరమిల్‌ వంటి అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌కి విచ్చేసి తమ కార్యాలయాల్ని ఏర్పాటు చేసే అవకాశమున్నది. ఇప్పటికే దేశంలోని ఇతర నగరాల్లో ఐటీ కార్యాకలాపాల్ని నిర్వహిస్తున్న పేరెన్నిక గల ఐటీ సంస్థలు.. తమ తదుపరి విస్తరణ ప్రణాళికల కోసం భాగ్యనగరాన్ని ఎంచుకుంటున్నాయి. పైగా, భూముల మార్కెట్‌ విలువలను హేతుబద్ధీకరిస్తారనే వార్తలు ఊపందుకుంటున్నాయి. ఇలాంటి సానుకూల పరిస్థితుల నేపథ్యంలో, మార్కెట్లో ఇండ్లకు గిరాకీ పెరుగుతుంది తప్ప తగ్గే అవకాశమే లేదు. పైగా, కొన్నాళ్లయ్యాక ఇప్పుడున్న రేట్లు కూడా ఉండకపోవచ్చు. ఇప్పటికే మార్కెట్‌ను క్షుణ్నంగా గమనిస్తే.. గత రెండు, మూడేండ్లలో ఫ్లాట్ల ధరలు అనూహ్యంగా పెరిగిన విషయం తెలిసిందే. అయినప్పటికీ, దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోల్చితే మన రేట్లు ఇంకా అందుబాటులోనే ఉన్నాయని చెప్పొచ్చు. ఇలాంటి పరిస్థితులన్నీ ఆకళింపు చేసుకుని.. సొంతింటి విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే నిర్ణయం తీసుకుంటే ఉత్తమం. 


పాల్గొనే సంస్థలు..

అపర్ణా, వాసవి, జేబీ ఇన్‌ఫ్రా, మైహోమ్‌ గ్రూప్‌, ఎస్‌ఎంఆర్‌ హోల్డింగ్స్‌, ప్రణవా గ్రూప్‌, ఇండిస్‌ గ్రూప్‌, గౌరా వెంచర్స్‌, సైబర్‌సిటీ డెవలపర్స్‌, వర్టెక్స్‌ హోమ్స్‌, రాజపుష్ప ప్రాపర్టీస్‌, గిరిధారి హోమ్స్‌, ఆకృతి, రాంకీ గ్రూప్‌, అనుహార్‌ హోమ్స్‌, సుమధుర, సాలర్‌పూరియా సత్వా, జైన్‌, హాల్‌మార్క్‌.

ప్రదీప్‌ కన్‌స్ట్రక్షన్స్‌, బీఎస్‌సీపీఎల్‌, కె.రహేజా కార్ప్‌, గ్రీన్‌మార్క్‌ డెవలపర్స్‌, కీర్తి, అయ్యన్న ఇన్‌ఫ్రా, ఈఐపీఎల్‌, బొటానికా, పీవీఆర్‌, 360 లైఫ్‌.

పూజా, ఆక్యురేట్‌ డెవలపర్స్‌, నిహారికా, ఆర్‌వీ నిర్మాణ్‌, ఎంపైర్‌ డెల్టా, మన్‌భూమ్‌, రాగమయూరి బిల్డర్స్‌, పసిఫికా, అశోకా, ఎస్‌వీ స్టార్‌హోమ్స్‌.

ఆర్క్‌ గ్రూప్‌, ఎన్‌సీసీ అర్బన్‌, మ్యాక్‌ ప్రాజెక్ట్స్‌, సువర్ణభూమి, ట్రైకలర్‌ ప్రాపర్టీస్‌, ఏపీఆర్‌ గ్రూప్‌, శ్రీ ఆదిత్యా హోమ్స్‌, శ్రీ రాధా, మోడీ బిల్డర్స్‌, జీహెచ్‌ఎంసీ, ఐజీబీసీ. 


బ్యాంకులు సైతం..

ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. బ్యాంకులు కూడా క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రాపర్టీ షోలో పాల్గొంటున్నాయి. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ హోమ్‌ లోన్స్‌, హెచ్డీఎఫ్‌సీ, ఆంధ్రా బ్యాంకు వంటివి తమ స్టాళ్లను ఈ ప్రాపర్టీ షోలో ప్రత్యేకంగా ముస్తాబు చేశాయి. ఈ బ్యాంకులు ఉండటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే.. కొనుగోలుదారులకు ఏదైనా ప్రాజెక్టు నచ్చిందంటే చాలు.. వారికి రుణమెంత లభిస్తుందో అక్కడికక్కడే తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. క్రెడాయ్‌ ప్రాపర్టీ షోకు విచ్చేసే సందర్శకులకు పలు బ్యాంకులు ప్రత్యేక రాయితీలను కూడా ప్రకటించే అవకాశాలున్నాయని తెలిసింది. కాబట్టి, ఎలా చూసినా, హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని ఆశించేవారు.. తుది నిర్ణయం తీసుకోవడానికి ఇంతకు మించిన మరో ఆప్షన్‌ లేదనే చెప్పాలి. 


క్రెడాయ్‌ ప్రాపర్టీ షో ప్రత్యేకతలివే.. 

స్థానిక సంస్థల అనుమతులు తీసుకున్న ప్రాజెక్టుల వివరాలే దొరుకుతాయి. 

ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాలు, వాణిజ్య సముదాయాలు.. ఇలా ప్రతి ప్రాపర్టీ సమాచారం లభిస్తుంది. 

లగ్జరీ గృహాలు, అందులో పొందుపరిచే అమెనిటీస్‌,వివిధ లొకేషన్లు, రేటు వంటి అంశాల్లో అనేక ఆప్షన్లు దొరుకుతాయి

ప్రాజెక్టు నచ్చితే చాలు.. అక్కడికక్కడే బ్యాంకు రుణం ఎంతొస్తుందో కనుక్కోవచ్చు

అన్నివిధాల నప్పే ప్రాపర్టీలు లభిస్తాయి కాబట్టి..ఇందులో కొంటే విన్నింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ చేసినట్లే లెక్క. 


logo