గురువారం 04 జూన్ 2020
Realestate - Jan 18, 2020 , 00:37:55

లగ్జరీ ఫ్లాట్ల జోరు

లగ్జరీ ఫ్లాట్ల జోరు

హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో లగ్జరీ అపార్టుమెంట్ల నిర్మాణం జోరుగా జరుగుతున్నది. పశ్చిమ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, నార్సింగి, కొండాపూర్‌, తెల్లాపూర్‌, మణికొండ వంటి ప్రాంతాలతో బాటు ఉప్పల్‌, బాచుపల్లి, రాజేంద్రనగర్‌, ఎల్‌బీనగర్‌, హయత్‌నగర్‌, కూకట్‌పల్లి, చందానగర్‌, అప్పా జంక్షన్‌ వంటి ప్రాంతాల్లోనూ పలు సంస్థలు తమ ప్రాజెక్టులను నిర్మిస్తున్నాయి. వీటిలో కొన్ని నిర్మాణాలు గృహప్రవేశానికి సిద్ధంగా ఉండటం విశేషం. మరికొన్ని ప్రాజెక్టుల్ని పలు సంస్థలు ఈ ఏడాది కొనుగోలుదారులకు అందించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఒకట్రెండు సంస్థలైతే 2025 నాటికి తమ నిర్మాణాన్ని అందజేస్తామని చెబుతున్నాయి. ప్రతి నిర్మాణాలు దాదాపుగా ఆధునిక సదుపాయాల్ని కొనుగోలుదారులకు అందజేస్తున్నాయి. ఆధునిక క్లబ్‌ హౌజ్‌, స్విమ్మింగ్‌ పూల్‌, ల్యాండ్‌ స్కేప్‌ గార్డెన్స్‌, షటిల్‌, బ్యాడ్మింటన్‌ కోర్టులు వంటివి సర్వసాధారణంగా మారాయి. 
logo