ఆదివారం 05 జూలై 2020
Rangareddy - Jul 01, 2020 , 00:17:28

పట్టణాల అభివృద్ధికి కృషి

పట్టణాల అభివృద్ధికి కృషి

బండ్లగూడ: పట్టణాల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ అన్నారు. బండ్లగూడ జాగీర్‌ కార్పొరేషన్‌ కార్యాలయం నిర్మాణానికి మేయర్‌ మహేందర్‌గౌడ్‌, నాయకులతో కలిసి మంగళవారం స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిస్మత్‌పూర్‌ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 181లోని ప్రభుత్వ స్థలాన్ని కార్యాలయానికి వినియోగించుకోవాలని  కలెక్టర్‌ ఉత్తర్వులు  జారీ చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ వేణుగోపాల్‌రెడ్డి, కార్పొరేటర్లు పద్మావతి పాండు, పద్మావతి పాపయ్య యాదవ్‌, రవీందర్‌రెడ్డి, మాలతీనాగరాజ్‌, అస్లాం బిన్‌ అబ్దుల్లా, శ్రీలత సురేశ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.


logo