సోమవారం 26 అక్టోబర్ 2020
Rangareddy - Sep 23, 2020 , 00:49:09

ప్రతిపక్షాలకు పనిలేకుండా.. ఎల్బీనగర్‌ అభివృద్ధి

ప్రతిపక్షాలకు పనిలేకుండా.. ఎల్బీనగర్‌ అభివృద్ధి

సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

 మార్నింగ్‌ వాక్‌లో కాలనీ సమస్యలకు పరిష్కారం   సుధీర్‌రెడ్డి

మన్సూరాబాద్‌, సెప్టెంబర్‌ 22 : కాలనీల్లో దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతూ ప్రజలకు పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మార్డీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. నాగోల్‌ డివిజన్‌ పరిధిలో రూ. 94.50లక్షలతో బృందావన్‌కాలనీ, కృషినగర్‌, అజయ్‌నగర్‌, హనుమాన్‌నగర్‌, వెంకట్‌రెడ్డినగర్‌ కాలనీల్లో నూతనంగా ఏర్పాటు చేయనున్న సీసీరోడ్డు పనులకు కార్పొరేటర్‌ చెరుకు సంగీతతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో తరచూ తలెత్తే ట్రాఫిక్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ఇప్పటికే ఎల్బీనగర్‌ రింగ్‌రోడ్డు, సాగర్‌ రింగ్‌రోడ్డు, చింతలకుంట ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ రోడ్లను పూర్తి చేశామన్నారు. నియోజకవర్గంలో 24 లోతట్టు కాలనీలు ఉండగా వాటిలో ఇప్పటికే ఎనిమిది కాలనీలకు వరదనీటి ముప్పు నుంచి విముక్తి కల్పించామని త్వరలో మిగిలిన కాలనీల వరదనీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు. కార్యక్రమంలో డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు సతీష్‌యాదవ్‌, నాయకులు అనంతుల రాజిరెడ్డి, చెరుకు జంగయ్యగౌడ్‌, తూర్పాటి చిరంజీవి, మెట్టు రవీందర్‌గౌడ్‌, సహదేవ్‌గౌడ్‌, హనుమాన్‌నగర్‌ కాలనీ అధ్యక్షుడు నర్సిరెడ్డి, సభ్యులు బాలయ్య, అనంతయ్య, రవి, జయకుమార్‌, సాగర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, బృందావన్‌ కాలనీ అధ్యక్షుడు తడక సాయిబాబా, ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌ రావు, కోశాధికారి చెన్నారెడ్డి, వెంకట్‌రెడ్డికాలనీ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, కార్యదర్శి రమణ, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.logo