మంగళవారం 24 నవంబర్ 2020
Rangareddy - Sep 08, 2020 , 00:43:57

రూ.20 కోట్లతో.. రోడ్లు అభివృద్ధి

రూ.20 కోట్లతో.. రోడ్లు అభివృద్ధి

మంత్రి సబితాఇంద్రారెడ్డి కృషితో నిధులు మంజూరు

హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు

 కందుకూరు: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లకు పెద్దపీట వేసింది. గ్రామాలకు వెళ్లే రహదారులు అభివృద్ధికి నోచుకోక ప్రజలు అవస్థలు పడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుపోయిని ప్రయోజనం లేకుండా పోయిం ది. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే ఆమె సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకుపోయి నిధులను మంజూరు చేయడానికి కృషి చేశారు . రూ. 20 కోట్లతో రహదారులను అభివృద్ధి చేయనున్నారు. నేదునూరు గేటు నుంచి బాచుపల్లి మీదుగా పులిమామిడి వరకు రూ. 6, 50 కోట్లు, సరస్వతీగూడ గేటు నుంచి లేమూ రు మీదుగా గూడూరు గేటు వరకు రూ. 7 కోట్లు, పులిమామిడి నుంచి మహేశ్వరం వరకు ఆర్‌బీ రోడ్లను విస్తరించడానికి రూ. 6 కోట్ల నిధులను మంజూరు చేశారు. టెండర్ల పక్రి య పూర్తి కాగానే పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి చొరవతోనే నిధులు

 శ్రీశైలం, హైదరాబాదు, సరస్వతీగూడ గేటు నుంచి రోడ్డు వెంట వెళ్లడానికి ప్రజలు నరకయాతన పడ్డారు. గతంలో ఎవరూ పట్టించుకోలేదు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిధులను మంజూరు చేయించారు. 

-రాము, సర్పంచ్‌ సరస్వతీగూడ

సంతోషంగా ఉంది

 రోడ్లను అభివృద్ధి చేయడానికి మంత్రి ఇంద్రారెడ్డి నిధులు మంజూరు చేయడం సంతోషంగా ఉంది. ఈ రోడ్ల మీద ఎన్నో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అయిన అధికారులు పట్టించుకోలేదు. 

- భూపాల్‌రెడ్డి, సర్పంచ్‌ ఆగర్‌మియాగూడ

అవస్థలు పడ్డాం

 నేదునూరు నుంచి బాచుపల్లి గ్రామానికి వెళ్లడానికి ఎన్నో అవస్థలు పడ్దాం. రోడ్లకు నిధులు మంజూరు చేయడంపై ప్రజలకు ఎంతో మేలు కలుగుతుంది.

- శ్రీనివాస్‌, సర్పంచ్‌ బాచుపల్లి