ఆదివారం 29 నవంబర్ 2020
Rangareddy - Aug 28, 2020 , 00:27:43

ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా: ఉప్పల్‌ ఎమ్మెల్యే ‘బేతి’

ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా: ఉప్పల్‌ ఎమ్మెల్యే ‘బేతి’

చర్లపల్లి: ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. చర్లపల్లి డివిజన్‌ పరిధిలోని చక్రీపురం, టీచర్స్‌కాలనీ, వెంకటరెడ్డినగర్‌ ప్రాంతాల్లో డిప్యూటీ కమిషనర్‌ శైలజ, ఏసీపీ కుద్దుస్‌లతో కలిసి ఆయన పాదయాత్ర చేశారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో శిథిలావస్థకు చేరుకున్న డ్రైనేజీలను గుర్తించి నూతన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నా రు. నూతన రోడ్ల నిర్మాణం పనులు చేపట్టనున్నామని చెప్పారు. కార్యక్రమంలో వాటర్‌వర్క్స్‌ అధికారి కృష్ణ, ఏఈ సత్యలక్ష్మి, టీఆర్‌ఎస్‌ డివిజన్‌ ఇన్‌చార్జి నాగిళ్ల బాల్‌రెడ్డి, నాయకులు నేమూరి మహేశ్‌గౌడ్‌, మహిపాల్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, బొడిగె రాజుగౌడ్‌, జాండ్ల ప్రభాకర్‌రెడ్డి, జనుంపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి, బాల్‌నర్సింహాగౌడ్‌, బాల్‌రాజు, భూపాల్‌రెడ్డి, స్థానికులు పాల్గొన్నారు.