శనివారం 28 నవంబర్ 2020
Rangareddy - Aug 16, 2020 , 23:51:44

ఆలయాన్ని అభివృద్ధి చేస్తా..

ఆలయాన్ని అభివృద్ధి చేస్తా..

 ఆర్కేపురం : ఖిల్లా మైసమ్మ ఆలయ చైర్మన్‌గా నియామకమైన గొడుగు శ్రీనివాస్‌ముదిరాజ్‌ మంత్రి సబితాఇంద్రారెడ్డిని ఆమె నివాసంలో ఆదివారం  కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖిల్లా మైసమ్మ ఆలయాన్ని  మంత్రి సబితాఇంద్రారెడ్డి, దేవాదాయశాఖ సహకారంతో అభివృద్ధి చేస్తానన్నారు.  టీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షుడు అరవింద్‌, ఉపాధ్యక్షుడు నగేశ్‌, యూత్‌ నియోజకవర్గ అధ్యక్షుడు లోకసాని కొండల్‌రెడ్డి, నాయకులు కొండ్ర శ్రీనివాస్‌, శ్రీనివాస్‌రెడ్డి, సాజిద్‌, వెంకటేశ్‌గౌడ్‌, గిరిగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.