బుధవారం 25 నవంబర్ 2020
Rangareddy - Jul 01, 2020 , 00:09:05

నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తా

నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తా

కందుకూరు: నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రోడ్ల అభివృద్ధికి రూ. 18.45 కోట్లు మంజూరు చేయడంతో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కప్పాటి పాండురంగారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల ఉపాధ్యక్షుడు సామ మహేందర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు మూల హన్మంత్‌రెడ్డి, యువజన విభాగం నాయకుడు కొలను విజ్ఞేశ్వర్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి మంగళవారం ఆమెను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రహదారుల టెండర్ల పక్రియను పూర్తిచేసి పనులను ప్రారంభించాలని సూచించారు. 

నేడు మంత్రి సబితాఇంద్రారెడ్డి  రాక

బడంగ్‌పేట:  మంత్రి సబితాఇంద్రారెడ్డి బుధవారం బడంగ్‌పేటకు రానున్నట్లు మేయర్‌ చిగిరింత పారిజాత తెలిపారు.దావూద్‌ఖాన్‌ గూడలో నిర్మించనున్న జిల్లా గ్రంథాలయ భవనానికి ఆమె శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు.  అధికారులు, నాయకులు హాజరు కావాలని సూచించారు.