శనివారం 28 నవంబర్ 2020
Rangareddy - Jul 12, 2020 , 23:28:23

భౌతికదూరం ఏది..!

భౌతికదూరం ఏది..!

వారాంతపు సంతల్లో నిబంధనలు పాటించని జనం

అధికారులు అవగాహన కల్పిస్తున్నా పట్టించుకోని వైనం 

బడంగ్‌పేట:  కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటూ అవగాహన కల్పిస్తున్నారు. కానీ బడంగ్‌పేట కార్పొరేషన్‌లోని  వారాంతపు సంతల్లో భౌతిక దూరం పాటించకుండా జ నం గుంపులుగా గుమిగూడుతున్నారు.  చాలా మంది మా స్కులు లేకుండానే వచ్చి  కూరగాయలు, నిత్యావసర సరుకులు కొంటున్నారు.  నిబంధనలు ఏమాత్రం పాటించడం లేదు. దీంతో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుందని పలువురు భయాందోళనకు గురవుతున్నారు. కొన్ని రోజుల వరకు వారాంతపు సంతలను  నిలిపివేయాలని కోరుతున్నారు. బాలాపూర్‌ మండలంలో రోజుకో కాలనీలో వా రాంతపు సంత ఉంటుంది. బడంగ్‌పేట, మీర్‌పేట  కార్పొరేషన్ల పరిధిలో ప్రతి రోజూ 20కి పైగా కరోనా కే సులు నమోదవుతున్నాయని వైద్యాధికారులు చెబుతున్నా .. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికే మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో సీఐ, డీఐ, ఎస్‌ఐ, కానిస్టేబుళ్లు, మేయర్‌, కమిషనర్‌, కార్పొరేటర్లు, మున్సిపల్‌ సిబ్బంది తదితరులు కరోనా బారిన పడ్డారు. కేసులు అధికంగా వస్తున్నాయంటే  ప్రజల నిర్లక్ష్యమేనని వై ద్యులు పేర్కొంటున్నా రు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ప్రతి ఒక్క రూ భౌతిక దూరం పా టించి, శానిటైజర్‌ వా డాలని అధికారులు సూ చిస్తున్నారు. 

నిర్లక్ష్యం చేస్తే ముప్పు తప్పదు

  మాస్కు లేకుండా ఎవరు బయటకు రావొద్దు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు. భౌతిక దూరం తప్పని సరిగా పాటించాలి. వైరస్‌ బారిన పడక ముందే జాగ్రత్తగా ఉండాలి. కరోనా పాజిటివ్‌ వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడ్డాను. చుట్టుపక్కల వాళ్లు, బంధువులు పట్టించుకోలేదు. గాంధీ దవాఖానలో చికిత్స చేయించుకున్నా. డాక్టర్లు బాగా చూశారు. భరోసా ఇచ్చారు. తొందరగానే కొలుకున్నా.

                                                                -దాసరి నర్సింహ, కరోనాను జయించిన వ్యక్తి