గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Sep 28, 2020 , 01:04:21

అలుగు పారుతున్న చెరువులు

అలుగు పారుతున్న చెరువులు

ఆశించిన వర్షాలతో ఆనందంలో అన్నదాతలు 

బొంరాస్‌పేట మండల పరిధిలోని 

బోరుబావుల్లో పెరిగిన భూగర్భ జలాలు 

బొంరాస్‌పేట : ఏళ్ల కొద్దీ నిండని మండల పరిధిలోని చెరువులు ఈసారి భారీ వర్షాలకు నిండి అలుగులు పారుతున్నాయి. గత రెండు, మూడేళ్లలో ఆశించిన వర్షాలు లేకపోవడంతో చెరువులు, కుంటల్లోకి నీరు చేరలేదు. ఈ ఏడాది జూలై నుంచి సెప్టెంబరు వరకు భారీ వర్షాలు కురిశాయి. బొంరాస్‌పేట, మెట్లకుంట, బురాన్‌పూర్‌, దుద్యాల, ఏర్పుమళ్ల కాకరవాణి ప్రాజెక్టులు పూర్తిగా నిండి అలుగులు పారుతున్నాయి. తొమ్మిది ఏండ్ల తర్వాత నాందార్‌పూర్‌ చింతల్‌ చెరువు, ఐదేండ్ల తర్వాత రేగడిమైలారం పటేల్‌ చెరువు పూర్తిస్థాయిలో నిండి అలుగులు పారుతున్నాయి. చెరువులు, కుంటల్లో మిషన్‌ కాకతీయ పథకం నిధులతో పూడిక తీయడంతో కట్టలు, తూములు, కాలువలను మరమ్మతులు చేశారు. అవన్నీ పటిష్టం కావడంతో పాటు నీటినిల్వ సామర్థ్యం పెరిగింది. చెరువులు తొణికిసలాడుతుండడంతో ఇక యాసంగి సాగుకు ఢోకా లేదని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలు కూడా గణనీయంగా పెరిగి స్థానిక బోరుబావుల్లోకి నీరు వచ్చింది. చెరువులు, కుంటల కింద సుమారు 3 వేలకుపైగా ఆయకట్టు ఉండగా, బోర్ల కింద ఈసారి మరో రెండు వేల ఎకరాలలో వరి సాగయ్యే అవకాశం ఉంది.