శనివారం 28 నవంబర్ 2020
Rangareddy - Aug 28, 2020 , 00:05:25

సంక్షేమ పథకాలు అందరికీ అందాలి

సంక్షేమ పథకాలు అందరికీ అందాలి

 ప్రభుత్వ విప్‌ అరెకపూడి గాంధీ

హైదర్‌నగర్‌ : కరోనా నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం తొలిసారి జూమ్‌ యాప్‌ ద్వారా గురువారం జరుగగా ప్రభుత్వ విప్‌, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, కలెక్టర్‌ అమెయ్‌కుమార్‌తో సహా ఇతర జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలను విప్‌ గాంధీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ కొండాపూర్‌ ఏరియా దవాఖానలో సిబ్బంది కొరతతో ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో నెలకొన్న ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయాలని కోరారు. నియోజకవర్గంలోని పలు అంశాలపై విప్‌ గాంధీ ప్రస్తావించగా.. కలెక్టర్‌ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.  సంక్షేమ పథకాలు  ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకు అధికారు లు తగిన కృషి చేయాలన్నారు.  అర్హులైన లబ్ధిదారులకు వీలైనంత త్వరగా ఇండ్లు కేటాయించాలని అధికారుల దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లారు.