మంగళవారం 24 నవంబర్ 2020
Rangareddy - Sep 28, 2020 , 00:55:31

కాలనీల అభ్యున్నతికి చేయూతనందిస్తాం

కాలనీల అభ్యున్నతికి చేయూతనందిస్తాం

 ఉప్పల్‌ : నియోజకవర్గంలోని కాలనీల అభ్యున్నతికి చేయూతనందిస్తామని ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. ఉప్పల్‌ డివిజన్‌లోని ఉప్పల్‌ హిల్స్‌ కాలనీ వాసులు ఆదివారం టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు మేకల మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా బ్యాలెట్‌ పద్దతిలో కాలనీ కార్యవర్గం ఎన్నుకున్నట్లు తెలిపారు. అధ్యక్షుడిగా ఎన్నికైనా సుధాకర్‌, ప్రధాన కార్యదర్శి నవీన్‌, కమిటీ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాలనీల్లో సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు. కాలనీవాసులు తమ సమస్యలను తెలియజేస్తే వాటిని తక్షణం పరిష్కరించే విధంగా చూస్తామన్నారు. కార్యక్రమంలో అరిటికాయల భాస్కర్‌, సంతోష్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, జగన్‌ పాల్గొన్నారు.