మంగళవారం 27 అక్టోబర్ 2020
Rangareddy - Sep 27, 2020 , 01:22:47

భూ సమస్యలు పరిష్కరిస్తాం

 భూ సమస్యలు పరిష్కరిస్తాం

 వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి కేటీఆర్‌

 మణికొండ : రాజేంద్రనగర్‌లోని భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా  నియోజకవర్గాల్లో నెలకొన్న భూ సమస్యలపై మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఎంపీ, ఎమ్మెల్యే, అధికారులతో మాట్లాడారు. ఈ సందర్బంగా రాజేంద్రనగర్‌ జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌, ఉప కమిషనర్‌ ప్రదీప్‌ పాల్గొన్నారు. సర్కిల్‌ పరిధిలోని జలాల్‌బాబానగర్‌, ఖయామ్‌ నగర్‌, హనుమాన్‌నగర్‌, టీఎస్‌ఐఆర్డీ, పాండురంగనగర్‌లో గల భూ సమస్యలకు సంబంధించిన అంశాలను పరిష్కరించాలంటూ మంత్రి కేటీఆర్‌ దృష్టికి  తీసుకువచ్చారు. అర్హులైన పేదలకు పట్టాలను ఇవ్వాలని కోరారు.


logo