శనివారం 28 నవంబర్ 2020
Rangareddy - Sep 30, 2020 , 07:07:27

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపిస్తాం.. ప్రేమ్‌గౌడ్

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపిస్తాం..  ప్రేమ్‌గౌడ్

 బండ్లగూడ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని మెజార్టీతో గెలిపించుకుంటామని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ప్రేమ్‌గౌడ్‌ అన్నారు. మంగళవారం డివిజన్‌ పరిధిలో డిగ్రీ చదివిన విద్యార్థులతో చర్చించి వారు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాలని బస్తీల్లో అవగాహన కల్పించారు. పేర్లను నమోదు చేసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. తమ పేర్లను నమోదు చేసుకునే ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులున్నా తాము పరిష్కరిస్తామన్నారు.