గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Sep 24, 2020 , 01:16:42

మూసీనదిలోకి పైపులైన్‌ ఏర్పాటు చేస్తాం

మూసీనదిలోకి పైపులైన్‌ ఏర్పాటు చేస్తాం

 ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి

మన్సూరాబాద్‌, సెప్టెంబర్‌ 23 : నాగోల్‌ డివిజన్‌ పరిధి లోతట్టు ప్రాంతాల్లో వర్షాకాలంలో తలెత్తుతున్న వరదనీటి సమస్యను పరిష్కరించాలని బుధవారం ఎమ్మార్డీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి డివిజన్‌ కార్పొరేటర్‌ చెరుకు సంగీత వినతిపత్రం సమర్పించి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాగోల్‌ డివిజన్‌ పరిధి శ్రీనివాసకాలనీ, ఆనంద్‌నగర్‌ కాలనీతో పాటు సుమారు మరో పది కాలనీల్లో వర్షాకాలంలో ఎదురవుతున్న వరదనీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఎగువ నుంచి వచ్చే వరద నీటిని మూసీ నదిలోకి మళ్లించే విధంగా పైపులైన్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు.