శనివారం 05 డిసెంబర్ 2020
Rangareddy - Aug 25, 2020 , 00:11:42

అవుట్‌లెట్‌ సమస్యను పరిష్కరిస్తాం

 అవుట్‌లెట్‌ సమస్యను పరిష్కరిస్తాం

మేయర్‌ చిగిరింత పారిజాత  

బడంగ్‌పేట, ఆగస్టు 24:  బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో అవుట్‌ లెట్‌ సమస్య జఠిలంగా మారిందని మేయర్‌ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి అన్నారు.  సోమవారం గుర్రం గూడ రాజలక్ష్మి కాలనీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.  గుర్రంగూడ ప్రభుత్వ పాఠశాలలో కొవిడ్‌ పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించారు.  అనంతరం  ఆమె మాట్లాడుతూ  కార్పొరేషన్‌ పరిధిలో  అవుట్‌లెట్‌ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి మంత్రి సబితాఇంద్రారెడ్డి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కాలనీల  సమస్యలపై దృష్టి సారిస్తున్నామన్నారు. కరోనా లక్షణాలు ఉన్న వారు టెస్టులు చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో  డీఈ అశోక్‌ రెడ్డి, కార్పొరేటర్లు గడ్డం లక్ష్మారెడ్డి, శంకర్‌, బోయపల్లి దీపిక శేఖర్‌రెడ్డి, నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, కాలనీ వాసులు యాదయ్య, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.