బుధవారం 25 నవంబర్ 2020
Rangareddy - Oct 01, 2020 , 07:02:47

ఇండ్లు కోల్పోయిన వారికి న్యాయం చేస్తాం... మంత్రి సబితాఇంద్రారెడ్డి

ఇండ్లు కోల్పోయిన వారికి న్యాయం చేస్తాం... మంత్రి సబితాఇంద్రారెడ్డి

మహేశ్వరం: రోడ్డు వెడల్పులో ఇండ్లు కోల్పోయిన బాధితులకు న్యాయం చేస్తానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం తుమ్ములూరు సర్పంచ్‌ మద్ది సురేఖ కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో బాధితులు  రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని కలిశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాధితులకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ గోవర్ధన్‌, వార్డు సభ్యులు శ్రీహరి,మౌనిక సుభాశ్‌ పాల్గొన్నారు.

సీఎం సహాయనిధి పేదలకు ఆసరా 

మహేశ్వరం: సీఎం సహాయనిధి పేదలకు వరంలాంటిదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. డబీల్‌గూడ గ్రామానికి చెందిన సుగుణమ్మ వైద్యఖర్చుల నిమిత్తము సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా ఆమెకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ. 25వేల చెక్కును విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి బుధవారం నగరంలోని ఆమె నివాసంలో అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ స్వప్నరవీందర్‌, ఏకులరాములు, దార జంగయ్య, కరుణాకర్‌, బాలకృష్ణ, పాండు, సత్తయ్యగౌడ్‌, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.