శుక్రవారం 30 అక్టోబర్ 2020
Rangareddy - Sep 23, 2020 , 00:49:13

‘పేదలకు అండగా నిలుస్తాం’

‘పేదలకు అండగా నిలుస్తాం’

ఉప్పల్‌, సెప్టెంబర్‌ 22 : పేద, మధ్యతరగతి ప్రజలకు రాష్ట్ర  ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరేలా పథకాలు రూపొందించారన్నారు. మంగళవారం ఉప్పల్‌లోని మేకల భారతిగార్డెన్‌లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు హాజరై ఉప్పల్‌ మండల పరిధిలోని 489మందికి చెక్కులు  పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మేకల అనలాహన్మంతరెడ్డి, బేతి స్వప్నారెడ్డి, గొల్లూరి అంజయ్య, శాంతిసాయిజెన్‌ శేఖర్‌, గంధం జ్యోత్న్సనాగేశ్వర్‌రావు, పన్నాల దేవేందర్‌రెడ్డి, గోపు సరస్వతీ సదానంద్‌, తహసీల్దార్‌ గౌతమ్‌కుమార్‌, నేతలు మేకల మధుసూదన్‌రెడ్డి, భాస్కర్‌ ముదిరాజ్‌, వేముల సంతోష్‌రెడ్డి, ప్రవీణ్‌ముదిరాజ్‌, పల్లా కిరణ్‌కుమార్‌రెడ్డి, నర్సింహారెడ్డి, గోపాల్‌రెడ్డి, పాల్గొన్నారు.