బషీరాబాద్ : భారీ వర్షానికి జుంటి వాగుకు వరద నీరు పోటేత్తింది. జుంటి వాగు ఎగువ ప్రాంతంలో భారీ వర్షం కురువడంతో మంగళవారం వాగు పొంగి ప్రవహించింది. వాగు పారడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులు, వాహనదారులు వాగు ప్రవాహాన్ని చూసి సంతోషం వ్యక్తం చేశారు. వాగు ప్రవహింస్తుండటంతో దిగువనున్న కాగ్నా నదికి కూడా జలకళ సంతరించుకోనుంది.