e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 23, 2021
Home రంగారెడ్డి Vikarabad : వికారాబాద్‌ జిల్లాలో స్టాఫ్‌నర్సు పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Vikarabad : వికారాబాద్‌ జిల్లాలో స్టాఫ్‌నర్సు పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

వికారాబాద్‌ : వికారాబాద్‌ జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయంలో డెలివరీ పాయింట్లలో పని చేయుటకు 6 స్టాఫ్‌నర్సు పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాలని డీఎంహెచ్‌వో తుకారం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్‌, డిగ్రీ సర్టిఫికేట్‌ కాఫీతో పాటు యాక్టివ్‌ నర్సింగ్‌ రిజిస్ట్రేషన్‌, మహిళా అభ్యర్థులు మాత్రమే నర్సు​‍ ప్రాక్టీషనర్‌ మిడ్‌వైఫరీ (ఎన్‌పీఎం) శిక్షణకు అర్హులన్నారు. అభ్యర్థులు 34 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు, రిజర్వేషన్‌ కలిగి ఉండాలని తెలిపారు. కనీసం రెండు సంవత్సరాలు లేబర్‌ రూమ్‌ అనుభవంతో పాటు గ్రామీణ/గిరిజన/చేరుకోవడానికి కష్టమైన ప్రాంతాల్లో ఒక సంవత్సరం లేబర్‌రూమ్‌ అనుభవం కలిగి ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు.

- Advertisement -

నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ నిర్వహిస్తున్న నర్సు​‍ ప్రాక్టీషనర్‌ మిడ్‌వైఫర్‌ కోసం 18 నెలల రెసిడెన్షియల్‌ కోర్సులో ప్రవేశించడానికి ఈ ఆఫ్లికేషన్‌ పరిగణించబడుతుందన్నారు. ఈ నెల 18 నుంచి 21వ తేదీ సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తుల స్వీకరిస్తామని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు గడువులోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement