e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home రంగారెడ్డి వైభవంగా పెరుగు బసంతం

వైభవంగా పెరుగు బసంతం

  • అనంతగిరికి పోటెత్తిన భక్త జనం
  • గరుడ వాహనంపై స్వామివారి ఊరేగింపు
  • కన్నులపండువగా చిన్న జాతర

వికారాబాద్‌, జూలై 24: వికారాబాద్‌ పట్టణానికి సమీపంలో ఉన్న అనంత పద్మనాభస్వామి దేవాలయంలో శనివారం చిన్న జాతర ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. కరోనా కారణంగా ఆలయ నిర్వాహకులు కొంత కాలంగా ఉత్సవాలు నిర్వహించకలేకపోయారు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో ఆనంతగిరికి భక్తుల తాకిడి రోజురోజుకూ పెరుగుతున్నది. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి సందర్భంగా అనంతపద్మనాభస్వామి చిన్న జాతర ఉత్సవాలను ఆలయ అధికారులు ఘనంగా నిర్వహించారు.

స్వామివారి ప్రతిమలను ఆలయ కోనేరు వరకు బాజాభజంత్రీలతో ఊరేగింపుగా తీసుకెళ్లి, వేద మంత్రోచ్ఛరణల మధ్య అర్చకులు మంగళ స్నానాలు చేయించారు. అనంతపద్మనాభస్వామి ప్రతిమను గరుడ వాహనంపై ఉంచి ఆలయ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ సమయంలో భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు. ఆలయ ఆవరణలో ఉన్న ధ్వజస్తంభంపై ఆలయ సిబ్బంది పెరుగు బుడ్డిని తీసుకెళ్లి పగులగొట్టారు. దీంతో చిన్నజాతర ప్రారంభమయ్యింది. ఈ ఉత్సవాలకు దూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

- Advertisement -

స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. తిరుగు ప్రయాణమయ్యే భక్తులు ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన మిఠాయిలు, ఆట వస్తువులను కొనుగోలు చేశారు. అనంతగిరిలో పెరుగు బసంతం కన్నుల పం డువగా సాగింది. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌, ము న్సిపల్‌ చైర్‌పర్సన్‌ మం జుల రమేశ్‌కుమార్‌ స్వామి వారికి పూజలు చేశారు. వీరితో జడ్పీటీ సీ ప్రమోదిని, ఎంపీపీ చంద్రకళ, ఎంపీడీవో సుభాషిణి, ఆలయ ఈ వో శేఖర్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ ధారూరు మండల అధ్యక్షుడు వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana