e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home రంగారెడ్డి కొడంగల్‌ అభివృద్ధి ప్రదాత మంత్రి కేటీఆర్‌

కొడంగల్‌ అభివృద్ధి ప్రదాత మంత్రి కేటీఆర్‌

  • సీఎం కేసీఆర్‌తోనే ప్రగతి పథంలో రాష్ట్రం
  • ఒకే రోజు 10వేల మొక్కలు నాటి సంబురాలు
  • రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి

దౌల్తాబాద్‌, జూలై24: కొడంగల్‌ అభివృద్ధిపై సీఎంతో పాటు మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవ చూపుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మంత్రి కేటీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని హరితహారంలో భాగంగా మండలంలోని గెండేపల్లి, అల్లాపూర్‌ గ్రామాల్లో ఉన్న అటవీ భూముల్లో మొక్కలు నాటారు. అనంతరం మంత్రి, ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో కలిసి దౌల్తాబాద్‌లో కేక్‌ కట్‌ చేసి, విద్యార్థులకు డిక్షనరీలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సీఎం కేసీఆర్‌ అకుంఠత దీక్షతో పాలన కొనసాగిస్తున్నారన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా ఐటీ, పరిశ్రమల అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారన్నారు. అమెరికా తరువాత అమేజాన్‌, మైక్రోసాఫ్ట్‌ సంస్థలు హైదరాబాద్‌లో దాటా సెంటర్లు ఏర్పాటు చేయడం మంత్రి కేటీఆర్‌ కృషికి నిదర్శనంగా పేర్కొన్నారు.

ఐటీలో 1400 కంపెనీల్లో 14 లక్షల ఉద్యోగాలను కల్పించిన ఘనత కేటీఆర్‌దేనన్నారు. గుండేపల్లి, అల్లాపూర్‌ ఆట వీ ప్రాంతంలో 10వేల మొక్కలు నాటారు. ఎమ్మె ల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరువతో భారీ ని ధులతో అనేక అభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఎఫ్‌ఆర్‌వో, సెక్షన్‌ ఆఫీసర్‌ నర్సింహులు, ఎం పీపీ విజయ్‌కుమార్‌, జట్పీటీసీ కోట్ల మహిపాల్‌, వైస్‌ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ మోహన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ప్రమోద్‌రావు, రైతు బంధు జిల్లా సభ్యుడు మల్లేశం, రైతు బంధు మండల అధ్యక్షుడు భగవంతు, సర్పంచులు, ఎంటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana