e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Home రంగారెడ్డి అల్లాపూర్‌.. అద్భుతం

అల్లాపూర్‌.. అద్భుతం

  • పల్లె ప్రగతితో గ్రామాభివృద్ధి
  • రూ.50 లక్షల నిధులతో ప్రగతి పనులు
  • అందుబాటులో పల్లె ప్రకృతి వనం, కంపోస్టు షెడ్డు, నర్సరీ
  • మిషన్‌ భగీరథతో తాగునీటి సమస్య పరిష్కారం
  • పారిశుధ్యం కోసం ప్రత్యేక చర్యలు
అల్లాపూర్‌.. అద్భుతం

కులకచర్ల, జూలై 21: మండలంలోని అల్లాపూర్‌ గ్రామం అభివృద్ధి పథంలో దుసుకుపోతున్నది. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టి, చాలా సమస్యలు పరిష్కరించారు. అల్లాపూర్‌ పంచాయతీలో 953 జనాభా, 253 కుటుంబాలు ఉన్నాయి. 875 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామ పంచాయతీతో పాటు చాకల్‌పల్లి, చెన్నగడ్డతండా, మాణిక్యనాయక్‌తండా అనుబంధ గ్రామాలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చే క్రమంలో అల్లాపూర్‌ పంచాయతీ ఏర్పడింది. గతంలో రాంరెడ్డిపల్లి పంచాయతీకి అనుబంధ గ్రామంగా ఉండేది.

సమస్యల్లోంచి అభివృద్ధి వైపు..
గతంలో సమస్యల్లో ఉన్న అల్లాపూర్‌ పంచాయతీగా ఏర్పడిన తరువాత గ్రామ రూపురేఖలు మారాయి. పంచాయతీని అభివృద్ధి చేసేందుకు సర్పంచ్‌ శివిబాయి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి పనులు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేసేందుకు పల్లె ప్రగతి కార్యక్రమం తీసుకొచ్చింది. ఇందులో భాగంగా గ్రామంలో తాగునీటి సమస్య, పారిశుధ్యంపై దృష్టి పెట్టింది. దీంతో గ్రామం పరిశుభ్రంగా మారంది. పల్లె ప్రగతి వచ్చిన తరువాత గ్రామంలో మౌలిక వసతులు, రోడ్డు సౌకర్యం కల్పించారు.

- Advertisement -

రూ.50లక్షలతో అభివృద్ధి పనులు
అల్లాపూర్‌ గ్రామ పంచాయతీలో సుమారుగా రూ.50 లక్షలతో అభివృద్ధి పనులు పూర్తిచేశారు. గ్రామంలో కంపోస్ట్‌ షెడ్డు నిర్మాణం కోసం రూ.2.20 లక్షలు, వైకుంఠధామం నిర్మాణానికి రూ.12.50 లక్షలు, 5 సీసీ రోడ్ల ఏర్పాటు కోసం రూ.7.84 లక్షలు, పల్లె ప్రకృతి వనానికి రూ.లక్ష, మురుగు నీటి కాల్వల ఏర్పాటుకు రూ.1.37 లక్షలు, వీధి లైట్లకు రూ.1.20 లక్షలు, శానిటైజేషన్‌ కోసం రూ.3.50 లక్షలు, ట్రాక్టర్‌తో పాటు, ట్రాలీ, ట్యాంకర్‌ కొనుగోలుకు రూ.9.80 లక్షలు, మిషన్‌ భగీరథ పథకంలో తాగు నీటి సౌకర్యం కల్పించారు. దీంతో పాటు గ్రామంలో అనేక అభివృద్ధి పనులు నిర్వహించారు. సర్పంచ్‌, ఎంపీటీసీ, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యుల సహకారంతో గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించి, గ్రామాన్ని ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నారు.

గ్రామంలో ముమ్మరంగా ప్రగతి పనులు
అల్లాపూర్‌ సమీపంలో హరితహారం నర్సరీ ఏర్పాటుచేశారు. ఇందులో మొక్కలు ఏపుగా పెరిగాయి. మొక్కల రక్షణకు పంచాయతీ ఆధ్వర్యంలో వన సేవకుడిని నియమించారు. హరితహారంలో భాగంగా నర్సరీల్లో పెంచిన మొక్కలు నాటుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి, వాటిని సంరక్షిస్తున్నారు. కంపోస్టు షెడ్డు నిర్మాణం పూర్తి కావడంతో సేంద్రియ ఎరువు తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు. గ్రామంలో సేకరించిన చెత్తను డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. పేడ, చెత్త ద్వారా ఎరువు తయారు చేస్తున్నారు. వైకుంఠధామం నిర్మాణం పనులు దాదాపు పూర్తయ్యాయి. పెద్ద గుట్టలా ఉన్న ప్రదేశాన్ని వైకుంఠధామానికి పనికొచ్చేలా తయారు చేశారు. గ్రామాలకు తాగునీటిని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకం తీసుకొచ్చింది. దీంతో గ్రామంలో ఇంటింటికీ నీటి సరఫరా కొనసాగుతున్నది. రైతులు పశువుల పాకలు, కల్లాలు వంటివి నిర్మించుకున్నారు. మురుగు నీటి కాల్వల నిర్మాణం చేపట్టారు. పంచాయతీ పరిధిలోని అనుబంధ గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం కొనసాగుతున్నది.

గ్రామ పరిశుభ్రతకు చర్యలు
అల్లాపూర్‌ గ్రామంలో పరిసరాల పరిశుభ్రతకు చర్యలు తీసుకుంటున్నారు. ఇద్దరిని పంచాయతీ కార్మికులుగా పెట్టుకుని వారి ద్వారా పారిశుధ్య పనులు చేయిస్తున్నారు. మురుగు నీటి కాల్వలు శుభ్రం చేయించడం, గ్రామంలో ఎక్కడా చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేయడం, రోజూ చెత్తను సేకరించి డంపింగ్‌ యార్డుకు తరలించడం లాంటి పనులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిధులతో పంచాయతీకి తీసుకున్న ట్రాక్టర్‌తో ఇంటింటికీ తిరుగుతూ చెత్త సేకరిస్తున్నారు. పంచాయతీ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి రెండు చెత్తబుట్టలు అందజేశారు. తడి, పొడి చెత్తను వేరుగా చేసి ట్రాక్టర్‌లో వేయాలని గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్నాం
గ్రామస్తుల సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పల్లె ప్రగతిలో వివిధ అభివృద్ధి పనులు నిర్వహించేందుకు పంచాయతీకి వచ్చే నిధుల ద్వారా గ్రామంలో ప్రభుత్వం సూచించిన అభివృద్ధి పనులు చేయిస్తున్నాం. ఇప్పటికే 90శాతం పనులు పూర్తిచేశాం. పల్లె ప్రకృతివనం, డంపింగ్‌ యార్డు కూడా ఏర్పాటు చేశాం. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాం.

  • శివిబాయి, సర్పంచ్‌, అల్లాపూర్‌

పల్లె ప్రగతితో అభివృద్ధి చేస్తున్నాం
గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వివిధ అభివృద్ధి పనులు చేస్తున్నాం. ప్రస్తుతం గ్రామంలో సమస్యలు పరిష్కారమయ్యాయి. పల్లె ప్రగతి ద్వారా అన్ని పనులు పూర్తిచేశాం. ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులతో గ్రామంలో అనేక అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నాం. గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు

  • బాలునాయక్‌, మాజీ ఎంపీటీసీ, అల్లాపూర్‌

గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాం
అల్లాపూర్‌ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాం. పల్లె ప్రగతిలో సూచించిన ప్రతి పనిని పూర్తి చేసి గ్రామంలోని సమస్యలను పరిష్కరిస్తున్నాం. సర్పంచ్‌ శివిబాయి సహకారంతో గ్రామం లో అభివృద్ధి పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. గ్రామంలో అవసరమున్న చోట్ల సీసీ రోడ్లు, మురుగు నీటి కాల్వల నిర్మాణాలు చేపట్టాం. గ్రామంలో ఎప్పటికప్పుడు పరిసరాల పరిశుభ్రతకు చర్యలు తీసుకుంటున్నాం.

  • మైమున బేగం, పంచాయతీ కార్యదర్శి, అల్లాపూర్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అల్లాపూర్‌.. అద్భుతం
అల్లాపూర్‌.. అద్భుతం
అల్లాపూర్‌.. అద్భుతం

ట్రెండింగ్‌

Advertisement