పరిగి, సెప్టెంబర్ 27 : పరిగి పట్టణంలోని పల్లవి డిగ్రీ కళాశాలలో మంగళవారం బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ సంబురాలలో విద్యా సంస్థల చైర్మన్ కొప్పుల అనిల్‌రెడ్డి, వైస్ చైర్మన్ డాక్టర్ కొప్పుల శ్రీదీప్తిరెడ్డిలు పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పే పండుగ బతుకమ్మ అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. బతుకమ్మ పండుగ సం దర్భంగా ప్రభుత్వం ఆడపడచులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయడంతోపాటు ఘనంగా ప్రభుత్వమే పండుగను నిర్వహిస్తున్నదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళాశాల మహిళా లెక్చరర్లు, విద్యార్థినులతో కలిసి శ్రీదీప్తిరెడ్డి బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్ర మంలో పరిగి, పూడూరు జడ్పీటీసీలు బి.హరిప్రియ, మలిపెద్ది మేఘమాల, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎ.సురేందర్, సీనియర్ నాయకుడు బి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాండూరు: బతుకమ్మ ఉత్సవాలు తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, యాలాల బషీరాబాద్, పెద్దేముల్ మండలాలతో పాటు మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో వైభవంగా కొనసాగుతున్నాయి. తీరొక్కపూలతో బతుకమ్మలను తయారు చేసి ఆడబిడ్డలు బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. మంగళ వారం తాండూరు సింధూ డిగ్రీ కళాశాలలో అట్టహాసంగా నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి చిహ్నం బతుకమ్మ..
తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి చిహ్నమైన బతుకమ్మ పండుగను మహిళలు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలో ఒకటని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిక్‌జైన్ అన్నారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మంగళ వారం జిల్లా వ్యవసాయ, ఉద్యానశాఖల ఆధ్వర్యంలో కలెక్టర్రేట్లో బతుకమ్మ సంబరా లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ ప్రతిక్‌జైన్ మా ట్లాడుతూ..బతుకమ్మ పండుగను పురస్కరించుకుని అక్టోబర్ 3వరకు తీరొక్క రీతిన నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కలెక్టరేట్లో జరిగిన బతుకమ్మ పండుగలో మహిళా ఉద్యోగినులతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా రెవె న్యూ అధికారి హరిప్రియ, వ్యవసాయాధికారి గీతారెడ్డి,తో పాటు మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.